చేతులతో కాసిన్ని ఎండుపుల్లలు పోగేస్తూ నువ్వలా నిప్పు రాజేస్తూ వుంటే
కనులలో పడ్డ ఆ కాంతి ఎఱగా మెరుస్తూ చుట్టూ వెచ్చగా పరుచుకుంటూ
అరచేతులను కాపుకుంటూ బుగ్గలపై వేస్తూ లోలోపలికి వెచ్చదనాన్ని పోగేసుకుంటూ మంటను ఎగదోస్తూ వీస్తున్న చల్లగాలిని కాసింత వేడిగా మార్చుకుంటూ
ఈ చెట్ల మద్య రాలిన ఆకులను యిలా కాగబెడుతూ కరుగుతున్న మంచు బిందువులను వేలితో తాకుతూ చెంపలపై రాస్తూంటే ఝుమ్మన్న నాదం గొంతులో ఒలికిపోతూ
ద్వైతం అద్వైతంగా మారుతున్న క్షణాల మద్య రాకాసి బొగ్గులా మండుతున్న ఒంటరితనమేదో మెదడు గోళంలో పగులుతూ ఉసుళ్ళమంటను చీలుస్తూ
రెండు దేహాత్మల మద్య కాగుతున్న నిశ్శబ్దాన్ని బద్ధలుకొట్టే సమయం దూరమవుతూ కాలం చీకటి పొరల మద్య ఒదిగిపోతూ