Monday, November 30, 2009

గురజాడ అడుగుజాడఈ రోజు మహాకవి గురజాడ వర్థంతి. ఆయన గురించి ప్రత్యేకించి సాహిత్య లోకానికి నేను రాసేది పుట్టింటి గొప్పతనం మేనమామతో చెప్పినట్లుంటుందిక్కడ. అయినా ఆయన చూపిన రచనా మార్గం తెలుగు సాహిత్య లోకాన్ని ఒక కుదుపునకు లోనుచేసింది. కథా రచనలో తన 'దిద్దుబాటు' కథతో ఆధునిక కథా శైలిని పరిచయంచేసినవారు. నూరేళ్ళు పైబడిన తన 'కన్యాశుల్కం' మహా నాటకం ద్వారా ప్రజల మనో నాడిని పట్టుకున్న తీరు అనితర సాధ్యం. నేటికీ మనకు ఆ పాత్రలు సజీవంగా కనులముందు కదలాడటమే కాక మనలో మనకి కూడా అగుపిస్తుండటం నిజం. గిరీశం పాత్ర సజీవ సాక్ష్యం. పుత్తడి బొమ్మా పూర్ణిమలు యింకా మన మద్య ఉండటం మన నేరం. సామాజిక సమస్యలపై అత్యంత సూక్ష్మ దృష్టితో ఎక్స్ రే తీసినట్లుగా పాత్రల సృష్టి గావించి తన సునిశిత సాహిత్య దృక్పథంతో వాటికి ప్రాణం పోయడం ద్వారా రచయిత కర్తవ్యాన్ని లోకానికి చాటిన వాడిగా ఆయనకు చేతులెత్తి నమస్కరిద్దాం. సాహిత్య ప్రక్రియలన్నింటిలోను తన ముద్ర వేసి పోయిన ఆయన అడుగుజాడ చెరగని వెన్నెలజాడ.

Sunday, November 22, 2009

కంచె వెనకాల


నా ఇంటి నుండి, వీధి నుండి,

చివరకు నా ఊరి నుండి వెళ్ళగొట్టి,

అయినవాళ్ళ ఉసురు తీసి,

నా గొడ్డు గోదా లాక్కుని,

నన్ను లూటీ చేసి


నేను అల్లుకున్న నా కలల పొదరిల్లును కూల్చి


స్వదేశంలోనే కాందిశీకుడ్ని చేసి,


నా మెడపై నా జీవితాన్నే కాడిగా మార్చి


నీవు నీ ముళ్ళ చేతులతో పావురాలను
ఎగరేసే ద్రోహాన్ని

బద్దలుకొట్టే
క్షణం కోసం ఈ కంచెవెనకాల నేను...


(నిర్బంధ సైనిక శిబిరాల వెనక బంధింపబడ్డ శ్రీలంక తమిళులు, దండకారణ్య ఆదివాసీలకు సంఘీభావంగా)

Saturday, November 14, 2009

రెక్కలు రాలిన ఎర్ర గులాబీ


మీరు రోజూ తాగి పారేసే సిగరెట్ల ఖర్చులో
అర
శాతమైనా బొచ్చెలో వెయ్యి బాబూ!
మీరు
ప్రతి క్షణమూ మీ సెల్ తో పలకరించే
మీ శ్రేయోభిలాషి కాల్ ఖర్చులో
ఒకటో వంతు ఇలా విదిలించేయి బాబూ!
రంయ్యిన మీ గర్ల్ ఫ్రెండ్ తో షికారుకయ్యే పెట్రోల్ ఖర్చులో
ఒక చుక్క విలువైనా విసిరేయి బాబూ!


సిగ్నల్ లైట్ వెలిగి ఆరిపోయే లోపు
నేను
వేసే పిల్లిమొగ్గలను లెక్కపెట్టగలవా?
చక్ర౦లో౦చి దేహాన్ని మెలికలు తిప్పిన
నా
నేర్పరితనాన్ని ఒక్కసారి చూసావా?
తాడుపై నా నడక నైపుణ్యాన్ని చూసావా?

మీరు
తిని పారేసే కాగితపు పొట్లాలలో
మిగిలింది ఏరుకోవడానికి నేనిప్పుడు
ఒక
అంతర్రాష్ట్ర యుద్ధాన్నేచేయాలి!

రైలు బండిలో మీ సీట్లకింద బుగ్గిని
తుడిచే
పిలగాడినీ నేనే?
మీ
ఎంగిలి ప్లేట్లను కడిగి మీరు తిన్న బల్లలను ఉడ్చి
నా
చేతి వేళ్ళు ఊరిపోయి చేప పిల్లలలా
తెల్లగా
పాలిపోయాయి!

ఖాకీ
బాబులకు నెలవారీ కేసుల లోటు తీర్చేది నేనే
రక్తం రుచిమరిగిన ఈ తెల్లపులుల మద్య
ప్రతి క్షణం
వేటాడబడుతున్నాను

ఏతల్లి
చేసిన పాపానికో మీ పుణ్యమూర్తుల
లోకాన ఉమ్మివేయబడ్డాను
నాయీ
పాపిష్టిజన్మకు విముక్తి ఎన్నడో?

నాకెవరిమీద అసూయ లేదు బాబయ్యా
మీరంతా మీ పిల్లల౦తా మీ కోటు జేబులకు
ఎర్రగులాబీలను
గుచ్చుకో౦డి!

నేనీ రాతిరి అమావాస్య చీకటిలో
రైలు పట్టా పక్కన నిశీధి స౦గీతాన్ని
విరిగిన వేణువుతో ఆలపిస్తాను.....
Related Posts Plugin for WordPress, Blogger...