
ఈ రోజు మహాకవి గురజాడ వర్థంతి. ఆయన గురించి ప్రత్యేకించి సాహిత్య లోకానికి నేను రాసేది పుట్టింటి గొప్పతనం మేనమామతో చెప్పినట్లుంటుందిక్కడ. అయినా ఆయన చూపిన రచనా మార్గం తెలుగు సాహిత్య లోకాన్ని ఒక కుదుపునకు లోనుచేసింది. కథా రచనలో తన 'దిద్దుబాటు' కథతో ఆధునిక కథా శైలిని పరిచయంచేసినవారు. నూరేళ్ళు పైబడిన తన 'కన్యాశుల్కం' మహా నాటకం ద్వారా ప్రజల మనో నాడిని పట్టుకున్న తీరు అనితర సాధ్యం. నేటికీ మనకు ఆ పాత్రలు సజీవంగా కనులముందు కదలాడటమే కాక మనలో మనకి కూడా అగుపిస్తుండటం నిజం. గిరీశం పాత్ర సజీవ సాక్ష్యం. పుత్తడి బొమ్మా పూర్ణిమలు యింకా మన మద్య ఉండటం మన నేరం. సామాజిక సమస్యలపై అత్యంత సూక్ష్మ దృష్టితో ఎక్స్ రే తీసినట్లుగా పాత్రల సృష్టి గావించి తన సునిశిత సాహిత్య దృక్పథంతో వాటికి ప్రాణం పోయడం ద్వారా రచయిత కర్తవ్యాన్ని లోకానికి చాటిన వాడిగా ఆయనకు చేతులెత్తి నమస్కరిద్దాం. సాహిత్య ప్రక్రియలన్నింటిలోను తన ముద్ర వేసి పోయిన ఆయన అడుగుజాడ చెరగని వెన్నెలజాడ.
బావుంది ఆయనను గుర్తు చేసుకోవటం, మీరు గుర్త చేయటం అభినందనీయం.
ReplyDeleteపూజ్యులు గురజాడవారికి అంజలి ఘటిద్దాం
ReplyDeleteభావన, మందాకినీ గార్లకుః మీ ఆత్మీయ సాహితీ స్పందనకు ధన్యవాదాలు.
ReplyDeleteకన్యాశుల్కం నాన్నగారి వలన కంఠోపాఠం. "మంచిచెడ్డలు లోకమందున ఎంచిచూడగ నిండు తులములు..." అది గురజాడ వారిదేనా? నేను పూర్ణమ్మగా నటించాను స్కూల్ నృత్యనాటికల్లో. ప్చ్... మార్పు అంత సులభతరమా...
ReplyDelete