Thursday, June 18, 2020

అజ్ఞాత

నీ చుట్టూ ఒక వల ఏదో కంటికి కనిపించని
                                 దారంతో నేయబడి

సీతాకోక చిలుకలు ఎగురుకుంటూ
                                గుంపుగా వచ్చి

చిక్కుపడి దారమంతా రంగులమయమై
                                      పైకి తేలిపోయి

దాని చుట్టూ కొన్ని పిచుకలు మూగి
                                 మౌనాన్ని కరిగిస్తూ   

నెత్తురోడి రెక్కలు తెగి వర్ణ రహితమైన
                                    సీతాకోకచిలుకలు

కొన్ని చినుకులేవో ముక్కలుగా పగిలిన వేళ
                                          భారంగా

గాలి ఏదో దు:ఖ గీతాన్ని ఆలపిస్తూ
                        కనురెప్పలను తాకుతూ

వెదురు చివుళ్ళు మధ్య  చిక్కుకుంటూ
                                 శూన్యావరణంలో

కను రెప్పలకావల దాగిన చెలమలో
                                      ఇగిరిపోతూ!

8 comments:

  1. ప్రకృతి ఆరాధకుల మనసు వోలె రమ్యం మీ రచన.

    ReplyDelete
  2. మీరు ఏది వ్రాసినా అందులో ఏదో నిగూఢ భావం దాగి ఉంటుంది...మీ రచనలకు సలాం.:)

    ReplyDelete
  3. జీవితమొక సాలేగూడు లాటిదనా
    బంధాలు పెనవేసుకుంటూనే స్వార్థం పాళ్ళు
    స్వార్థం తగ్గుముఖం పట్టేలోపే బహుశ లోకం మనుగడ మారు

    లోకం మనుగడ మారేలోపే ఏదో పేచి
    ఆ పేచి ముదిరే లోపే కన్నీటి ధారల సూచి

    ఏదేమైనపటికి జీవితం జీవాత్మ పరమాత్మల కలయిక
    ఆ జీవాత్మ కి మరో జీవాత్మ తోడు నీడ

    ఆ తోడు నీడ విడిచేది ఉచ్వాశ నిఃశ్వాస ఆగినాక
    అది కూడ ఒకరినొకరు విడదీయని బంధాన్ని పెనవేసుకున్నాక

    అబ్బుర పరిచే జీవితాన అనూహ్యమైన సంగతులు
    వాటికణుగుణంగా మారేనేమో కదా తీరు తెన్నులు
    కడిగిన ముత్యపు ఆల్చిప్పలో కాలమనే ఇసుక రేణువు

    ~శ్రీత ధరణీ

    ReplyDelete
  4. ఉపయోగకరమైన సమాచారం మీ పోస్ట్‌కు ధన్యవాదాలు
    Telangana News in Telugu
    Andhra Pradesh Latest

    ReplyDelete
  5. బహుశ అతను ఊరిలో ఇల్లిల్లు తిరుగు ఉండేవాడేమో.. అలా తిరగాడుతున్న వేళ అతనికి ఒకానొక ఇల్లు నచ్చి ఇలా అనుకున్నాడేమో..
    "ఇల్లు ఎంత బాగుంది. ఏదేమైన నా కూతురికి ఈ ఇంటితోనే ముడి పెట్టా"లని తీర్మానించుకుని.. ఆ ఇల్లెవరిదని వాకబు చేసి. ఆ ఇంటి వివరాలు తెలిసిన వారి కాళ్ళావేళ్ళా పడీ మరీ ఒప్పించుకుని ఆ ఇంటిలో తిష్ట వేసుకుందామనుకునే సమయానికి ఆ ఇంటి ఓనరోళ్ళ అబ్బాయికి ఆ అమ్మాయే నచ్చిందని పరిణయమాడి.. తానెక్కడుంటే సతి సైతం అచటే ఉండాలనుకుని తనతో పాటు తను నివసిస్తున్న పటణంలో గల ఇంటికి తరలించబోతే.. రెండేళ్ళ తరువాత "మేము ఊరిలో ఇంటిని చూసి ఇచ్చాము.. ఆ ఇల్లులో అమ్మాయి చిన్న మేనమామ బోలు బొచ్చెలు, పెద మామ బీరువా, కూలర్ నానమ్మ సోకు అద్దం పెట్టే, తాత మంచం, చినాయన ఫిల్టర్ ఇపించాడని వాపోతు ఆ తల్లి-తండ్రి-కూతురు త్రయం ఆ ఇంటికే వారసుడైన వానితో తగాద పెట్టుకుంటే.. బంగారు చెవిదుద్దులు కూడా లేని ఆ అమ్మాడికి గడచిన రెండేళ్ళలో గాజులు, హారం, మాంగళ్యం తో పాటుగా మాతృత్వం సైతం అంతా తానై సమకూర్చితే.. హన్నన్నా.. "మాకు ఇల్లే ఆస్తి బంధం ఇవాలుంటది మరీ రేపు" అంటు నిలదీస్తే అనక "మరో ఐదేళ్ళకు అచటికే ఏగుదాం ఇపుడు రోజులసలే బాగోలే"వంటే కూడా వినిపించుకోకుండ ఏ రాళిఘాళి మాటలను చెవిన వేసుకుని.. ఒకటుంటే ఒహటిలేని తన తండ్రి ఇంట అలిగి ఉంది గాని..మాంగళ్య దాత, చిరకాల బంధంతో ముడిపడి ఉన్న వాని యోగక్షేమాలను కనుకుందామనే కనీస ఇంగితం, నేటి వరకు తిట్టకుండ కొట్టకుండ ఏదడిగితే అది కొని తెచ్చిచ్చే వారి పట్ల కనీస కృతజ్ఞత భావం కూడా లేని కలికాలం.

    విప్లవాత్మక సామాజిక ఘట్టాలను, అలాగే ప్రకృతి సోయగాలను మీ కవితలలో అలవోకగా అల్లగలిగే మీ బ్లాగ్ లో నేను కూడా కొంచం పదును కు ధీటుగానే వ్యాఖ్యానించాలని ఆలోచించిథే నా బుర్రకు తట్టిన ఓ కథకాని కథకు రూపునివ్వటం జరిగింది. ఈ రచన ఎవరిని ఉద్దేశించినది కాదు. ఫిక్షన్ మాత్రమే.. కే క్యూబ్ వర్మ గారు..! అందరు క్షేమమని తలుస్తున్నాను సర్.. !!

    కథలో తప్పులున్నా లేదా పై కథ కథలా లేకపోయినా క్షంతవ్యుణ్ణి.. :)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...