Wednesday, April 22, 2020

మల్లెల వేళ

కాలం
వేయి నాల్కలతో
ఎగురుతూ వస్తోంది

నీకూ నాకూ మధ్య
ఓ అఖాతాన్ని
సృష్టిస్తోంది

ఈ మల్లెల వేళ
యింత ఎడబాటును
కర్కసంగా విధిస్తోంది

అయినా
అక్షరాలతో
వంతెన కడుతూన్న
నీ ముందు
కాలం మోకరిల్లుతోంది..



9 comments:

  1. నమస్తే సారూ..కుశలమా?

    ReplyDelete
  2. మీ కవితలు చాలా బాగుంటాయి. మరిన్ని కవితలు వ్రాయండి.

    ReplyDelete
  3. వెల్ కం టూ బ్లాగ్..
    మళ్ళీ మీరాకతో వెన్నెలదారి
    వెలుగుతో నిండిపోయింది
    ఎన్ని అగాధాలు సృష్టించబడినా
    గెలుపు మనదే ...

    ReplyDelete
  4. నిన్న మొన్నటి మల్లే తీగలు పచ్చగానే ఉన్నాయి
    వాటికి పూచిన ధవళ మల్లియలు గుభాళింపు తగ్గలేదు
    నిన్న మొన్నటి కోయిల గొంతుక కమ్మగానే ఉంది
    వసంతాన్ని ఆహ్వానించి తాను చల్లగా జారుకుంది మామిడితోటలో
    మరి మారిందల్లా ఏమిటి
    ప్రకృతి వైపరిత్యమో ఏమో శార్వరి నాట నుండి కోవిడ్ కలకలం కలవరం పెడుతు ఉంది
    మూడో నెలలో మూడంకెలుగా ఉంటు బెంబెలెత్తిస్తునే ఐదవ నెల ముగింపులో ఐదు అంకెలుగా మార్చి హడలెత్తిస్తోంది.
    అది చాలదన్నట్లు ఎల్జీ పాలిమర్ స్టైరీన్ గ్యాస్ తో అతలాకుతలం చేసింది.
    ఏదేమైనపటికి మనోధైర్యాని ఆత్మస్తైర్యాన్ని కోల్పోకుండ కాలానుగుణంగ ఎదురేగుతు ముందుకు సాగుతూ మానవాళి.

    ~శ్రీ

    ReplyDelete
  5. అందరికీ ధన్యవాదాలు. మరల మీరంతా బ్లాగ్ లో కలుస్తారని అనుకోలేదు. ఫేస్‌బుక్ వాట్సప్ ప్రభంజనంలో. మరొకసారి ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. కుమార్ వర్మ గారు..
      వాట్సాప్ ఉన్నా గాని దేని విలువ దానికే..
      రోజువారి దైనందన విషయాలను వాట్సాప్ ద్వార తెలుసుకోవచాచు
      ఐతే
      బ్లాగ్ లో ఆలోచనలను ఏకరూపు పెట్టవచ్చు..
      బ్లాగ్ లో భావాలను వ్యక్త పరచవచ్చు..
      అందుకే..
      కోవిడ్ కాలమున సైతం అలుపెరుగని భావాలను అక్షరాలతో మేళవించి.. వీలుచిక్కినపుడిలా..!
      దేని ప్రాముఖ్యత దానిదే..
      జీవితమొక ఓపెన్ బుక్ లాటిది
      కాని దానిట్లో అక్షరాలనేవి ఆ బుక్ ఓనర్ కు మాత్రమే తెలుసు
      ఆయా అక్షరాలలో దాగిన భావాల సంగమమే మనలో జరిగే అర్థాలకూ అనర్థాలకు అవమానాలకు పొగడ్తలకు దిక్సూచి
      ఒక్కోసారి నర్మగర్బంగా కాలం.. మరొకమారు సునాయాస సరాగం.. ఒక్కో ధర్మ సోపానం మనందరి జీవితాల ఆయువుపట్టు.. లెక్కలేనిన్ని క్షణాలలో ఇమిడిన ఈ జీవిత గమనం.. ఆ భగవంతుని క్రియశీల కవనం..!

      ~శ్రీ

      Delete
    2. శ్రీధర్ గారితో నేను ఏకీభవిస్తున్నాను. బ్లాగ్ లో వ్రాసుకున్నవి మన ఆస్తులు అనుకోవచ్చు. వ్రాస్తుండండి.

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...