యారాడ కొండల్ని తాకిన
అలలు ఆ నవ్వు నురుగులో
కలగలిసి అస్తమించే సూర్యున్ని
నుదుట తిలకంలా దిద్ది
గుండె చెమ్మనంతా
కరచాలనంతో
పారదోలే ప్రేమ జగతి
ఆ ఒంటరి ఇసుక మేటలను
దాటలేక పలవరిస్తే
జాబిల్లినే మింగిన వెన్నెలా
ఆకాశపు తేరులో
తను చివరిగా గానం
చేసిన కవితను
ఒకసారి వినిపించవూ...
(లవ్ జేకు ప్రేమతో)
No comments:
Post a Comment
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..