Thursday, May 28, 2009

కాల మేఘం

ఇప్పుడంతా మౌనం రాజ్యమేలుతోంది
ఇక్కడంతా శూన్యం ఆవరించుకుంది
సగంకాలిన మృతకలేబరాల కమురువాసన
కమ్ముకున్న కాలమేఘం!
అటు జాఫ్నా- ములైతీవునుండి
ఇటు పాలమూరు - ఓరుగల్లు వరకు
అక్కడ ప్రభాకరన్ నుదుటిపై
బుల్లెట్ గాయం
ఇక్కడ సూర్యం గొంతులో దిగబడ్డ
కత్తివేటు !!
ప్రజల జీవితాలలో ఉషోదయాన్ని
ఆశించి తుదికంటా పోరాడిన వీరులు
మడమ తిప్పని యుద్ధ తంత్ర నిపుణులు
పోరాట బావుటా రెపరెపలు
సామ్రాజ్యవాదుల దమననీతికి
ఎదురుగా మూడు దశాబ్దాలుగా
జనశ్రేనులను సాయుధులుగా
కదిలించిన కదనరంగా నిపుణులు!
నేలకొరిగిన ప్రజావీరుల అమరత్వం
చరిత్రలో చివరిసారీకాదు మొదటిసారీకాదు!
వారిపోరాట వారసత్వం మరింత తేజోవంతమై
తూరుపున లేలేత కిరణాలలో
ఉదయిస్తు౦దన్నది సత్యం!
రాజపక్షాలు రాజసేఖరులు
మట్టిపాలుకావడం ఖాయం!!

Monday, May 18, 2009

తమిళ ఈలం పోరాటం ఫేనిక్ష్ పక్షిలా మళ్ళీ లేవాలని

శ్రీల౦క లో తమిళుల దుర్భర జీవితానికి పరాకాష్ట. గత కొన్ని సంవత్సరాలుగా వారిపై జరిగిన నిరంకుశ దాడి. తమిళ ఈలం పరిష్కారంగా ఎల్.టి.టి.ఈ. వారు చేస్తున్న పోరాటం ముగింపునకు చేరుకున్నదని లంకేసుడు ప్రకటించడం వారి దాష్టీకానికి గుర్తు. కాని ప్రజల మనసులనుండి అంత తొందరగా జరిగిన అన్యాయపురిత దాడిని చెరిపెయగలరా. ప్రజా పోరాటాలకు ముగింపు సైనిక చర్యల ద్వారా పలకలేరనేది చారిత్రిక సత్యం. భారత పరిపాలక వర్గాలు ఈ విషయాన్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ తమ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. ఒక పరాయి దేశంలో తమ సంతతికి చెందిన జనావలిపై రాక్షస దాడి జరుగుతుంటే కళ్లు మూసుకున్న దేశం మరోటి వుండదేమో. తమ భూభాగంలో ఉగ్రవాద నిర్మూలన పేరుతొ జనన హననాన్ని సృష్టిస్తుంటే కనీసపు చర్యలైనా తీసుకొని నిర్దయ పూరిత పాలక వర్గాన్ని కలిగివుండడం మన దురదృష్టం. పులులు చేసిన పోరాటం హిన్సాత్మకమైనదే కావచ్చు. కాని ఆ పేరుతొ ఎన్నో లక్షల మంది సామాన్య అమాయక ప్రజలు బలికావడం, దానిని చూస్తూ కుడా సభ్య ప్రపంచం కళ్లు ముసుకోవడం, కంటి తుడుపు చర్యల అమెరికా వాడి మానవ హక్కుల సంఘాలు అరవడం తప్ప దానిని ఆపేందుకు ఎవడు కృషి చేయక పోవడం వెనక ఎవరి వ్యాపారాలు వాళ్లకు వున్నాయనేది స్పష్టమౌతోంది. రాజీవ్ గాంధీ హత్యను సాకుగా చూపించి అక్కడి మొత్తం తమిళ జాతినే నాశనం చేసేందుకు సహకరించిన భారత ప్రభుత్వం దమన నీతిని మానవత్వం వున్నవారు తప్పనిసరిగా ఖండించాలి. అసలు పులుల ఆవిర్భావం ఈ దేశ రా సహకారంతోనే మొదట జరిగిందనేది జగమెరిగిన సత్యం. శాంతి పరిరక్షణ పేరుతొ వారిపై యుద్ధానికి వెళ్ళింది వీళ్ళే. కడుపు మండే వాడు అంత కంటే ఏమి చేస్తాడు. భారత్ లో కూడా కుటిల చాణక్య పరిపాలనలో భింద్రన్ వాలేలను సృష్టించి తమ పబ్బం గడవగానే అంతమొందించి ఎంతో మంది సిక్కు యువకులను బలిగొన్న చరిత్ర మన పాలకులది. అన్నీ తెలిసిన వారు కుడా మౌనం దాల్చడం మన దౌర్భాగ్యం. అమ్ముడుపోయిన మన సార్వభౌమత్వానికి నిదర్సనం. మరణించిన వీరులకు నా హృదయాంజలి ఘటిస్తున్నాను. వారి నిస్వార్ధ పూరిత పోరాటానికి, త్యాగానికి జోహార్లు తెలియచేస్తున్నాను. మరో ఈలం పోరాటం మొగ్గ తొడిగి తమల సోదరుల కల నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Sunday, May 17, 2009

ఇంక మూసుకు౦దా౦

ఇంక అన్నీ మూసుకు౦దా౦
ఒక పెద్ద విజయాన్ని సాధించేసాం

తోలుబొమ్మలాటలో తెరను
చిమ్పేసుకొని ఈటీ వాడు
ఆట తరువాత చాప చుట్టుకొని
చ౦కన పెట్టి పోయినట్లుగా
ఓడిపోయామో గెలిచామో
ఎప్పటికి తెలియని ఒక మీమాంసతో
ఇప్పటికి ఇంతే అనుకొని
తీసిన కత్తులను పదును పెడతామనుకుంటూనే
వాయిదా వేసిన వైనాన్ని, చేతగానితనాన్ని
తిట్టుకు౦టూ...

నిరాశామయ మేఘాల మాటుకు
తప్పుకు౦టూ తలపై తెల్లని గుడ్డ
కప్పుకొని ఓడిపోయిన కోర్టు పక్షిలా
ఇంటిలో ఒక మూలకు మీరు నేను

వాడు ధవళ వస్త్రాల౦క్ఱుతుడై
సి౦హాసన౦పై..

(ప్రతిసారి ఏదో గొప్ప మార్పు తన బతుకులో వస్తుందని ఆసిస్తూ మోసపోతున్న సామాన్యుడి ఆవేదనకు స౦ఘీభావ౦గా)

Tuesday, May 12, 2009

ఏవి తల్లీ.....

ఏవి తల్లీ మూనిరుడు మొరిగిన
మూర తుపాకులు?

రాని వసంత కాలానికి ముందే
చర్చల కూత కూసిన
తెల్ల కోయిలల రాగాలకు
వంత పాడిన వాళ్ల గొంతులు
శాశ్వతంగా మూగబోయినాయి

ఎందరో నూనుగు మీసగాళ్ళు
ధారపోసిన వృధా క్రొన్నెత్తురుతో
రాజేసిన రావణ కాష్టంలో నేడు
పేలాలు ఏరుకొని నీటుగా చలువ
గదులలో సేద తీరుతున్న వృద్ధ
జ౦బూకాల నామాలను
బయటపెట్టే వాడెవ్వడు?

రాజమార్తా౦డుల వారి ముడుచక్రాల
బండికి ముందు సైకిలు చిని
తిరుగాడుతున్నవాడి పల్లూడగొట్టే వాడెవ్వడు?

మొండి చెయ్యి తోలుబొమ్మలాటకు
నీడలా వెన్నంటి దీపపు సమ్మె అయి
వెలుగుతున్న వాడిని కాలరుపట్టి
తెరముందుకు లాగేవాదేవ్వాడు?

భ్రమల శ్లేష్మంలో చిక్కుకుని
రెక్కలాడక ఉపిరాడక
అమరుడైన వాడి స్తుపానికి
ఇటుక మోసేవాదేవ్వాడు ?

ఆకాసంలో కన్పించని అరునతారలై
మెరుస్తున్న వారి రక్తచారికలను
పులుముకుని కునిరాగాలాపనతో
కాలక్షేపం చేస్తున్న వాడి
చర్మాన్ని వలిచేవాదేవ్వాడు?

నెరిసిపోయిన వెంట్రుకలకు
గోద్రెజ్ వాడి రంగు పులుముకుని
లేని యావ్వనాన్ని చూపెడుతూ
తకధిమితోం ఆడుతున్న వాడి
అసలురంగు బయట పెట్టేవాదేవ్వాడు ?

గూగుల్ దూరని గూడెం లేకపోయే...
సెల్ మొగని సందు లేకపోయే...
సాయంకాలపు చీకు ముక్కలకు
చీప్ లిక్కరుకు వాడి ముడ్డి చుట్టూ
తిరగని వాడు కరువయినారు !

కోవర్ట్ ఎవడో నీ హార్టు ఎవరో
కనిపెట్టలేని చత్వారంతో
ఆంధ్రాలో నీ జాడే లేకుండా
చేసిన యీ ముసుగు దొంగల
బాగోతం బయట పెట్టె వాడెవ్వడు తల్లీ..
(కొంతమంది విప్లవం ముసుగులో పనిచేస్తున్న నాయకుల కార్యాచరణకు స్పందనగా)

Monday, May 4, 2009

యుద్ధం మొదలయ్యేదే...

ప్రస్ని౦చ౦డి ప్రస్ని౦చ౦డి
ఆదిమానవుడు ప్రకృతి ఒదిలో౦చి
వేసిన పెనుకేకలా
ప్రశ్నించడం నేర్చుకోండి ....

యుద్ధం ప్రారంభానికి ముందు
ద్రౌపదిలా ప్రస్ని౦చ౦డి
యుద్ధం మొదలయ్యేదే
ప్రశ్నతోనే కదా!
ప్రస్నించక పొతే
ఇంతదూరం ప్రయాణి౦చే వాళ్ళమా ?
ప్రశ్నల ప్రవాహ ఉరవడితోనే
రాపిడితోనే నేటి
మన ఆకృతి దాల్చాం
మనిషి ఎప్పటికీ ఆదిమతత్వంతోనే
మొదలవ్వాలి....
తనకనులపై కమ్ముకునే
మాయపొరలను
తన నాభినుండి తన్నుకువచ్చే
ప్రశ్న మాత్రమే తొలగించగలదు!
ప్రశ్నే ఎప్పటికీ
నిజమైన నేస్తం...
Related Posts Plugin for WordPress, Blogger...