Wednesday, August 24, 2011

పాప నా కంట్లో కరగని ఓ కన్నీటి కల..
మనో వినీలాకాశంలో

నీ బోసి నవ్వు
ఓ జాబిలి సంతకం..


నీవు వదలి వెల్లిన
జ్ఞాపకాలు

గుండె గదిలో ఎన్నటికీ పదిలం...


నీకో పేరు పెట్టి పిలుచుకొని మురిసిపోక ముందే

తెంచుకున్న పేగుబంధం

ఎప్పటికీ తరగని విషాదం...


నీ లేలేత పాదాలు
నా గుండెలపై
నాట్యమాడకుండానే మాయమయ్యాయన్న గురుతు
వెంటాడుతూనే వుంది కన్నా...


నీ గుండెలపై వాలిన
ఆ నీలి రాక్షసి
ఎవ్వరో
నన్ను మిగిల్చి ఎంత తప్పు చేసిందో....

పాపా
!

నీవు
నా కంటి రెప్పల
మాటున
దాగిన కరగని ఓ కన్నీటి కలవు...


(ఈ దినం మమ్మల్ని విడిచి వెళ్ళిన చిన్నారి జన్మదినం)

9 comments:

 1. గుండెలను కదిలించింది వర్మాజీ ! ఏమీ చెప్పాలో అర్ధం కాని స్థితి . ఎంత వయసులో జరిగింది వర్మాజీ. మనసును మీ స్వాధీనంలో ఉంచుకోమని చెప్పడం కన్న నేను చేయగలిగిన్దేముంది....శ్రేయోభిలాషి.Nutakki Raghavendra Rao.(Kanakambaram)

  ReplyDelete
 2. రాజా!మరపురాని మీపాప గురుతులను మాతో పంచుకోవటం చాలాబాగుంది.
  నిజమే జ్ఞాపకమంటేనే "మరపురాని"దని కదా !
  నిజ జీవిత సంఘటనలను కూడా కవిత్వీకరించి చెప్పటం మీకు చాలా సులువైపోయినట్లుంది .
  మీరు పోగొట్టుకున్న పసి రూపాన్ని మాకు మీ కవిత్వంలో ఆవిష్కరించి చూపించారు. Congratulations !!!

  ReplyDelete
 3. పోగొట్టుకోవడం ఏమిటో నాకు తెలుసు, బౌతికంగా, మానసికంగా నాకు దూరంగా ఉంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి మరచిపోండి అని నేను చెప్పను. ఆ జ్ఞాపకాలే మనల్ని బ్రతికిస్తున్నాయి.

  ReplyDelete
 4. andari manasulu kadilinche kavita, bagundy kanee edi ????????????????????????????????????

  ReplyDelete
 5. ఈ ఎలిజీ వెంట మమ్మల్ని నడిపించారు
  జ్ఞాపకం బలీయమైనప్పుడు వ్యక్తీకరించే అక్షరాలవెంట నడిచే కళ్ళు చెమర్చకుండా ఎలా వుంటాయి

  ReplyDelete
 6. మిత్రులందరికీ ముందుగా క్షమాపణలు...నా బాధను మీకు పంచినందుకు....

  ReplyDelete
 7. అజ్నాత గారు ???? ఏమడిగారు???

  ReplyDelete
 8. గుండెను మెలిపెట్టినట్లుగా ఉంది మీ కవిత వర్మగారు... చిన్నారి పాదాలు మీ గుండెలపై నాట్యమాడకముందే నన్ను వదిలి వెళ్లాయంటూ మీరు చెబుతుంటే కళ్లల్లో నీళ్లు ఉబుకుతున్నాయి..

  అలా వచ్చి, ఇలా వెళ్లిపోయే వాళ్లు, కొన్నాళ్లు మనతో జీవించి వెళ్లేవాళ్లు... అన్నీ తామే అయి జీవితంలో కలసివచ్చినవాళ్లు ఆకస్మికంగా దూరమవటం... ఇలా ఒక్కో దశలో ఒక్కొక్కరు దూరమవుతూనే ఉంటారు.. అయితే వాళ్ల జ్ఞాపకాలు మాత్రం మిగిలివున్న వాళ్ల మనస్సుల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి...

  ReplyDelete
 9. శొభ గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..

  ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...