Saturday, September 26, 2020

ఎప్పటికీ ఒక పాట కొరకు..









కొన్ని ఖాళీలు 

అలా మిగిలిపోతూ వుంటాయి

 

ఒక్కొక్కరు వారి చెరగని సంతకం 

చేసి వెళ్ళిపోతారు


ఎంత అనుకరించినా దాని ముద్ర 

చెరిగిపోదు


ఖాళీలు పూరించడానికి 

ఎవరెవరో వస్తారు


కానీ ఒక్కొక్కరిదీ ఒక 

లిపిగానే మిగిలిపోతుంది


ఖాళీల మధ్య తడి ఆరని 

బంధమేదో పరిమళిస్తుంది


ఎవరి పేజీ వారిని తన లోలోపలి

పొరలలో దాచుకుంటుంది పుడమి


ఖాళీలను పూరిస్తూ కొత్త 

విత్తనమేదో చిగురిస్తుంది మరొకసారి


వేచి వుందాం చెవులు రిక్కించి

భూమి పొరలపై... 

(గాన గంధర్వ బాలు తలపులో) 

2 comments:

  1. మరో బాలుగారు

    మరల పుట్టడం...

    ఆ గంధర్వ గానం

    మరల వినడం...

    జరగని పని

    బాలుగారికి ఆశ్రు నివాళి

    ReplyDelete
  2. "పాడనా తీయ్యగ కమ్మని ఒక పాట"
    "పాటగా మిగలన మీ అందరి నోట"

    గాత్రం మారుమ్రోగుతోంది ప్రతి సారి పాట రూపేణ
    మహామహులు బహుశ సాహిత్యానికి రక్తి కట్టి రిక్తమై నేడు జ్ఞాపకమై మిగిలే ఉంటారు

    "జాబిలి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై"
    అని బహుశ ఏ దేవదూత తలచుకుందో ఏమో.. హూటాహూటిన స్వర్గానికేగినారు పాటల మజిలిలో

    "నా ఉచ్వాసం కవనం నా నిఃశ్వాసం గానం"
    ఆ గాన గంధర్వుని మాట పాట మూడు మల్లెలంత సుకుమారం

    "నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు గావింప"
    మధురానుభూతులను అందరి మదిలో చిరకాలపు ముద్ర వేసి

    "రవి వర్మ కే అందని ఒకే ఒక అందానివో"
    ఏ గొంతుకకైన అలవోకగా స్వరాలు కూర్చి స్వరాభిషేకం గావించ గలిగిన వసంత కోయిల

    "చిరియో, నాగియో, వెంకియో, బాలియో" వార్లకే గాక "అల్లు, ఆలి, రాజేంద్రియో" వార్లకు సైతం అనుకున్న తడవకే ఆయా గాత్రాలలో మమేకమౌతు సాగిన స్వరసాగర మథనానికి వారధి కీర్తి శేషులు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారికి అశృతప్త ఘన నివాళి.

    ~శ్రీ

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...