కొద్దిగా ఒత్తిగిలి
ఈ ఆకుల ఆకాశం పైకప్పు కింద
కాసింత విశ్రమించనివ్వండి
కాసింత విశ్రమించనివ్వండి
ఈ నేలను ఇంకిన ఈ చినుకు విత్తును
కాసింత మొలకెత్తనివ్వండి
కాసింత మొలకెత్తనివ్వండి
ఈ సెకనుకు సెకనుకు మధ్య ఖాళీని
కాసింత పూరించనివ్వండి
కాసింత పూరించనివ్వండి
ఈ మెలకువకు సుషుప్తకు మధ్య
కాసింత విరామమివ్వండి
కాసింత విరామమివ్వండి
ఈ స్వప్నాన్ని ఆ వేకువ కొక్కేనికి
కాసింత వేలాడనీయండి!!
కాసింత వేలాడనీయండి!!
(రచనా కాలం8-7-2015)
కోవిడ్ మహమ్మారి దృష్ట్యా పచ్చ పచ్చాని వాకిట మునుపటిలా నిలవలేము, చెట్లు ఇంతక్రితం ప్రాణవాయువు కారకాలు.. ఇపుడు కూడా అవి ప్రాణవాయు దాతలే.. కాని మారిన కాలం మనిషినే భయభ్రాంతులకు లోను చేస్తోంది.
ReplyDeleteకోవిడ్ మహమ్మారి దృష్ట్యా అడుగులకు మడుగులొత్తనీకుండా కవర్ చే వ్రాప్ చేసుకుని ఉండగలిగే స్థితికి చేరుకున్నామా.. ఏమో..
నడయాడిన పుడమి గోధూళిలో చిన్న నాటి జ్ఞాపకాలతో పాటుగా పరుగు పరుగున అమాంతం పడి మోకాలి పై దెబ్బలు తిన్న రోజులు ఆత్మ స్థైర్యాన్ని నింపేవి.
కోవిడ్ కాలమున కాల గణనంత మరచి మునుపటిలా క్రికెట్ స్కోర్ కు బదులుగా కార్ స్టాటిస్టిక్స్ చూడాల్సి వచ్చిన తరుణాన ఏ రోజు ఎలా గడుస్తుందోననే ఆందోళన నడుమ మెకానికల్ టిక్, డింగ్-డాంగ్ శబ్దాలన్ని బహుశ స్తబ్దుగా చూస్తున్నాయేమోనన్న చిన్న మిమాంస
కోవిడ్ మహమ్మారి కాలం మొదలుకోని
నిన్నటికి నేటికి రేపటికి మునుపటిలా జ్ఞాపకాల తాయిలాలు ఉండేవి.. నిన్నటి బాధలను రేపటి ఆశలతో ముడిపెట్టి.. నేటి నిమిషాన కాలానీదుతు ఉండే మానవ మాత్రుల మందరికి.. నిన్నటి జ్ఞాపకాలు, రేపటికి ఏమౌతుందోననే చింత.. నేటిని కృంగదీతలోనే నిటూర్చేలా ఏమార్చిందేమో
కోవిడ్ మహమ్మారి కాలం బహుశ మనలో ఇన్నేళ్ళ ఆత్మన్యూనత భావాన్ని తలదన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించటానికనే అయ్యుంటుంది. ఈ కోవిడ్ అనే మహమ్మారి సోకితేనే కలిగే శ్వాసకోశ సంబంధిత వ్యాదులు, న్యూమోనియా, హైపర్ సెన్-సిటివిటి, హైపాక్సియా, లో ఇమ్యూనిటి వంటి నిర్ధారిత లక్షణాలతో ౪౨ శాతం మరణాలు సంభవిస్తుంటే.. ఆ వ్యాధి రేపటి రోజున ఎలా విజృంభిస్తు ఉంటుందోననే ఒక సైలెంట్ ఇంప్లోజివ్ స్ట్రాటెజి అందరి మైండ్ లలో ఫిక్స్ అయ్యి..వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాలు, పౌష్టిక సంతులిత ఆహారం, ఈ కోవిడ్ లాటి ఎన్నో కారు చీకటులను రూపు మాపుతు వస్తున్న ఈ మానవాళికి ఒకానొక రోజున సంపూర్ణ ఆయురారోగ్యాల సూర్య రష్మి తాకనుందనే భావన మొలకెత్తితే.. అదే ఒక నింబ వృక్షమై సదా సర్వదా జనవాహిని హితము కూర్చి ఈ కోవిడ్ మహమ్మారిని సైతం గెలవ గలమనే స్ఫూర్తిని కలగించకమానదు. ఈ సందర్భముగా మన ఆరోగ్య రక్షణ రిత్య తాము సైతం పాట్లు పడుతున్న సకల వైద్య సిబ్బందికి, రక్షణ శాఖ వారికి, పారిశుద్ధ్య కార్మిక జనానికి, తక్కువ మొతాదులో ఎవరికి వారుగా సెల్ఫ్ ఐసోలేట్ అవుతు ప్రేరణాత్మకంగా ఎవరిని వారే కాపాడుకుంటు సమాజాన్ని సైతం కాపాడుతున్న జనావళికి అభినందన కుసుమాంజలి.
~శ్రీత ధరణీ
This comment has been removed by the author.
Deleteధన్యవాదాలు
Deleteమీరు మరెన్నిమార్లు రాసినా
ReplyDeleteమళ్ళీ మళ్ళీ కొత్తగా చదివినట్లే ఉంటుంది.
అది మీ అభిమానం. ధన్యవాదాలు అర్పితాజీ
Deleteఈ సెకనుకు సెకనుకు మధ్య ఖాళీని
ReplyDeleteకాసింత పూరించనివ్వండి..sensitive feel
Thank you mam
DeleteReally great lines
ReplyDeletechala manchi aalochanalu.
ReplyDelete