Thursday, May 28, 2009

కాల మేఘం

ఇప్పుడంతా మౌనం రాజ్యమేలుతోంది
ఇక్కడంతా శూన్యం ఆవరించుకుంది
సగంకాలిన మృతకలేబరాల కమురువాసన
కమ్ముకున్న కాలమేఘం!
అటు జాఫ్నా- ములైతీవునుండి
ఇటు పాలమూరు - ఓరుగల్లు వరకు
అక్కడ ప్రభాకరన్ నుదుటిపై
బుల్లెట్ గాయం
ఇక్కడ సూర్యం గొంతులో దిగబడ్డ
కత్తివేటు !!
ప్రజల జీవితాలలో ఉషోదయాన్ని
ఆశించి తుదికంటా పోరాడిన వీరులు
మడమ తిప్పని యుద్ధ తంత్ర నిపుణులు
పోరాట బావుటా రెపరెపలు
సామ్రాజ్యవాదుల దమననీతికి
ఎదురుగా మూడు దశాబ్దాలుగా
జనశ్రేనులను సాయుధులుగా
కదిలించిన కదనరంగా నిపుణులు!
నేలకొరిగిన ప్రజావీరుల అమరత్వం
చరిత్రలో చివరిసారీకాదు మొదటిసారీకాదు!
వారిపోరాట వారసత్వం మరింత తేజోవంతమై
తూరుపున లేలేత కిరణాలలో
ఉదయిస్తు౦దన్నది సత్యం!
రాజపక్షాలు రాజసేఖరులు
మట్టిపాలుకావడం ఖాయం!!

2 comments:

  1. ఎంత ఆశావాదులండీ మీరు....మనుషులందరినీ ఒకే రకం క్లోనులను చేసే వరకు, మనుషుల్లో, మనస్సులో, స్థాయిల్లో అసమానత్వం ఉన్నంత వరకు.....వర్గాలు తప్పవు, వర్గ పోరాటాలు తప్పవు..........ఎంత మారినా మనిషొక మృగం....మనిషి కథేమో అరణ్య పర్వం.

    ReplyDelete
  2. మీ బ్లాగ్ బాగుంది... మీ పోస్ట్ కూడా.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...