Saturday, June 6, 2009

కొలిమి



ఎండలు ఎండలు

కళింగ యుద్ధానంతరం తెగిపడిన మొండెంలా మానులు
ఎటుచూసినా మోడులైన కొండలు
ఎండిన మా నాయనమ్మ గు౦డెల్ల కనిపిస్తున్నాయి...

వేడిగా కాలుతున్న పెనంలా మండుతున్న కొండరాళ్ళు
ఝుమ్మని కీచుగొంతుతో పాడిన పాటలా
రాళ్ళమధ్యసుళ్ళు తిరుగుతున్న వడగాలి....

ఈ ప్రయాణం సుదూరం
ఈ కాలం మరింత భారం...

దప్పికతో గొంతులోకి చుట్టుకుపోతున్న నాలుక
పారే వాగూ వంకల మాటున మాటుకాసిన
బూడిద కుక్కలు....

ఈ కాలం నష్టాల కొలిమి
నిన్నటివరకు తన గుండెల్లో పొదువుకున్న అడవితల్లి
ఎండిన బొమికలతో తనతోపాటు మమ్మల్ని
'గురి' కావిస్తుంది...

పచ్చదనం కోల్పోయి మా అవ్వ
నెరసిన జుట్టులా వుంది...

వానచినుకుకోసం ఆత్రంగా
ఎండిన దోసిళ్ళతో నేనూ....

2 comments:

  1. బాగుంది మీ కవిత...
    మీతో పాటు మేము ఎదురు చూస్తున్నాము...

    ReplyDelete
  2. ఈ ఎండలకి కందిరీగలు కూడా దప్పిక తీర్చుకోను నీళ్ళ బకెట్లకి అంటి పెట్టుకుపోయాయి అన్న మా అన్నయ్య మాట గుర్తొచ్చిందండి. కవితలోని ఉధృత భీతిని కలిగించింది - సమీప భావిలో అంతా నీళ్ళకోసం ఇలా అల్లాడతామా? ఎండ భారిన పడి వడగాల్పు పాలవుతామా అని.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...