నిన్న మొన్నటి జ్ఞాపకం
నా కంటి తెరచాపల మాటున కదలాడుతోంది
ఉబికిన కన్నీళ్లు-ఉగ్గబట్టుకున్న దుఃఖం
సుడులు తిరుగుతుండగా ఇప్పటికీ
మీ కరచాలనపు స్పర్శ వెచ్చగా
గుండె పొరల్లో దాగివుంది
పండు వెన్నెలలాంటి మీ నవ్వు
వాన వెలిసిన రాత్రి మబ్బుల
మాటునుండి తొ౦గిచూసిన
జాబిలి మోములో ప్రతిఫలిస్తుంది..
గలగలా పారే సెలయేళ్ళు
మీ మాటల ఉసులు విన్పిస్తున్నాయి
వడివడిగా పారే వాగులు
మీ నడకలోని వేగాన్ని గుర్తుకు తెస్తున్నాయి
పచ్చటి వరిచేలు యూనిఫా౦గా మారి
మిమ్మల్ని గు౦డెల్లో దాచుకు౦టా౦ రారమ్మని
పిలుస్తున్నట్లుగా వున్నాయి
ఎత్తైన శిఖరాలు మీ నిబ్బరానికి
శిరసువంచి నమస్కరిస్తున్నాయి
తూర్పున ఉదయి౦చే సూరీడు
మీ అమరత్వపు అరుణిమను అద్దుకొని
మరింత ఎర్రబారుతూ
మాకు అభయమిస్తున్నాడు
మిత్రులారా మా గుండెల్లో దాగిన
మీ తడి ఆరని జ్ఞాపకాలూ
ఎప్పటికీ మీ నిర్మల త్యాగాన్ని
మరువనివ్వదు.....
వర్మ గారు, ఈ పాటి సానుభూతి, అవగాహన చాలు. అన్నీ ఆచరించనవసరం లేదు. అది సాధ్యం కాదు కూడా. సంస్కారం అన్నది ప్రస్ఫుటంగా వెలివడేది మన అభిప్రాయ వ్యక్తీకరణలోనే.
ReplyDelete