Thursday, June 11, 2009

కన్నీటి చినుకులు


నిన్ను చూడగానే
పసితనంలో నీవుకూడా నా
చిన్నారి చెల్లెలా అమ్మకొంగు పట్టుకొని
ఆడిన దోబూచులాటలు గుర్తొచ్చాయి

మా ఊరి పచ్చని పొలాల గట్ల వెంట
పట్టు పరికినీలతో పరుగులిడిన నా
చిన్నారి గజ్జెల సవ్వడి వినబడుతూంది

నీ రెండు కళ్లు మా ఊరి నీలాటి
రేవును గుర్తుగా చూపెట్టాయి

ఎ గాలానికి చిక్కిన బంగారుపాపవో
ఈ చెరలో చెరచబడుతున్నావు

శుష్కించిన నీ దేహంలో
వీర్యస్నానమాడుతున్నారు

ఎదలోని ఆవేదనను వడలిన
కనురెప్పలక్రి౦ద దాచుకు౦టూ
ఎప్పుడూ వాడని గులాబీలా
పెదాలపై ఎరుపునవ్వుతో
స్వాగతిస్తావు!

మెరుపుల నీ చీర వెనుక మేడిప౦డు
సమాజాన్ని దాచేస్తూ తలుకులీనుతావు

ఎన్నో యదార్ధ వ్యథార్త జీవన శకలాలని నీ
రె౦డు కాళ్ళ స౦ధ్యలో దాచిపెడుతూ
కర్మయోగిలా కదిలిపోతావు

మరుసటి క్షణం కోసం ఆర్తిగా
ఎదురుచూసే నీకు ఏమివ్వగలను
కలతపడ్డం కొత్తగాని నీకు
రె౦డు కన్నీటి చినుకులు తప్ప!

విసిరేయబడ్డ శుక్రకణాల చారికలలో
ఎక్కడో దాక్కున్న నా ముఖ చిత్రాన్ని
వెదుక్కు౦టున్నాను ......

4 comments:

  1. ఎంతగా ద్రవించినట్లుందంటే మనసంతా కెలికేసినట్లుగా, కంటికి కమ్మిన నీరు, గుండెకడ్డుపడినట్లుగా... ఎప్పుడో చదివిన సమీక్ష. కేరళలోని ఒక స్త్రీ ప్రశ్నిస్తుంది, "ఇంట్లో ఎంత విందు భోజనాలు తినా మీ ఇంటి మగవారు హోటల్ కి వెళ్ళినట్లే మీరెన్ని పడకింటి సుఖాలనిచ్చినా సగం మంది చూపు మా వంటి వారిపైనే అని. కాదని ఎందరు చెప్పగలరు? మేమే లేకుంటే మీరంతా చెప్పే కులస్త్రీలు ఎంత మంది చెరచబడేవారో కదా?" అని. రె౦డు కన్నీటి చినుకులు కాదు వీరి కోసం జన్మంతా శోకించినా ఋణం తీరదు.

    ReplyDelete
  2. వర్మ గారు, తెలుగులో ఎలా వ్యాఖ్య వ్రాయాలి అన్న మీ ప్రశ్నకి ఈ వేదిక ముఖంగానైతే మరి కొందరికి ఉపయోగపడొచ్చు, మరికొమదరు ఇంకొన్ని సూచనలు ఇవ్వొచ్చు... ఇదొకసారి చదవండి, నేను బ్లాగు మొదలు పెట్టిన తొలిరోజుల్లో చదివి దాచుకున్న రిఫరెన్సిది.. http://blog.vihaari.net/2008/05/2.html అలాగే నేను వీవెన్ గారి http://lekhini.org/ ఎక్కువగా నిజానికి ఈ వ్యాఖ్య వ్రాయటానికి కూడా వాడుతున్నాను. కానీ ఒక స్నేహితురాలి సలహాతో http://service.monusoft.com/TeluguTypePad.htm కూడా వాడుతున్నాను. ప్రతిదానికీ ప్రత్యామ్న్యాయ తరుణోపాయాలు వుంచుకోవటం అలవాటు. అందుకు ఇలా 2-3 పద్దతులు, వినియోగాలు తెలుసుకున్నాను. కొందరు గౌతమీ http://www.ascenderfonts.com/font/gautami-telugu.aspx వాడతారు. ఇవి ప్రయత్నించి చూడండి. బహుశా మరొకరైనా might jump in and say "Yeah! try this, it's cool" అని ఇంకొక టూల్ గురించి చెపొచ్చు. చివరిగా నా పట్ల మీ ఆదరణపూరిత వాక్కులకి ధన్యవాదాలు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...