ఒక స్వప్న మేఘం
కరిగిపోతూ
అందరి హృదయాలలో
కన్నీటిని వర్షించింది
స్వప్న పధికుడు
మరెవరికీ అందనంత
దూరం వడివడిగా
నడుచుకుంటూ పోయాడు!
శోధన నాళికలో౦చి
స్వప్న లోకాల
పయనమయ్యాడు
శిరస్సు తెగిన దీపపు
స్తంభానికి తన
జీవన నౌక
లంగరు వేయగా
పెద్ద పెద్ద అంగలు
వేసుకు౦టూ పోయాడు
కానీ..
పైకి చూడు నీ
మనో నేత్రంతో
ఆయన వేలి చివరలను౦డి
రాలిన వెన్నెలాకాసంలో
మంచు శిల్పాలు
కరిగిపోతూ
అందరి హృదయాలలో
కన్నీటిని వర్షించింది
స్వప్న పధికుడు
మరెవరికీ అందనంత
దూరం వడివడిగా
నడుచుకుంటూ పోయాడు!
శోధన నాళికలో౦చి
స్వప్న లోకాల
పయనమయ్యాడు
శిరస్సు తెగిన దీపపు
స్తంభానికి తన
జీవన నౌక
లంగరు వేయగా
పెద్ద పెద్ద అంగలు
వేసుకు౦టూ పోయాడు
కానీ..
పైకి చూడు నీ
మనో నేత్రంతో
ఆయన వేలి చివరలను౦డి
రాలిన వెన్నెలాకాసంలో
మంచు శిల్పాలు
వర్మ గారు బావుంది వర్ణన
ReplyDeleteస్వప్న పథికుని శోధన,పయనం నా మనో చక్షువు బానే కాంచింది. మనోనేత్రాన్ని తెరిచేముందు అసలు వున్న ఇంద్రియాలనే వాడుకోని మనిషి దుర్బలత కూడా గుర్తుకొచ్చింది. నాకున్నది వరమో శాపమో, స్వప్నాల్లో విహారం నా నైజం.
ReplyDelete