రైఫిల్ భుజానేసుకుని అతను
వడివడిగా
వెనుక నేనూ ఆయాసపడుతూ....
చీకటిలో ఆయన నవ్వు
అడివంతా పరచుకున్న వెన్నెల
మిత్రమా... ఎన్నేళ్ళీ ప్రయాణం
అమ్మ కన్న కలలు సాకారమయ్యే౦త వరకూ....
అవును నిజమే
ఊరి గుమ్మానికి వేలాడుతున్న ఖ౦డితుని
శిరస్సు నవ్వే౦తవరకూ....
రైఫిల్ భుజానేసుకుని అతడూ ఆమె
వడివడిగా
నడిచినంతమేరా పచ్చదన౦తో
పుడమితల్లి పులకిస్తూ.....
ఎదుటివారి మౌనాన్ని బద్దలుకొడుతున్న
వారి పలకరి౦పు
భుజం కలుపుతూ ఆయాసాన్ని మాయం చేస్తూ
స్నేహంగా కరచాలనం....
ఝె౦డా భుజానేసుకుని అతడూ.. ఆమె.. నేనూ..
వడివడిగా.....
(అమరుల స్మృతిలో....)
Wonderful post.....with beautiful picture
ReplyDeleteWonderful post with Beautiful picture..
ReplyDelete"ఏ తల్లి కన్న బిడ్డలో అన్నలు మా ఎర్ర మల్లెపువ్వులు" అన్న పాట గుర్తొచ్చింది, అలాగే గద్దర్ పాటలు. మాదిరెడ్డి సులోచన గారి "మరీచిక" నవల కూడా గుర్తొచ్చింది. కృష్ణవంశీ "సింధూరం", మణిరత్నం "అమృత" మరొక సినిమా "ఫర్ ద పీపుల్" ఇలా విప్లవ వాదుల ప్రస్తావన వున్న ఎన్నో. ఒకప్పుడు వాటి పట్ల ఆకర్షణకి గురయ్యాను. కాని నాకు నేనే పూర్తిగా సమాధానపడలేక ఆ బాటలోకి వెళ్ళలేదు. అందులో విశ్వాసంవున్న వారి పట్ల మాత్రం అవగాహన వుంది. మీ మనోభావాల్ని దెబ్బ తీయటం నా అభిమతం కాదు. నా స్వానుభవం అది.
ReplyDeleteఉష గారికి.. ముందుగా మీ ప్రతిస్పందనకు కృతజ్ణతలు. మధ్యతరతి భద్రమయ జీవితాలలో త్యాగం చేయడానికి అంత తొందరగా అంగీకరించలేం. అది మన బలహీనతగానే నేను భావిస్తాను. కానీ నేడు ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ మార్గమన్నది ఎప్పటికైనా అదే అవుతుంది అనేది నా విశ్వాసం. ఈ కుహనా రాజకీయ దళారుల నుండి విముక్తి లభించాలంటే పోరాటమే మార్గం. ఇలా మీతో నా ఊహలు పంచుకునే అవకాశమిచ్చినందుకు థాంక్స్.
ReplyDeleteపదార్పిత గారికి..మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.
ReplyDeleteచాలా బావుందండి.
ReplyDeletemaaku kooda nachindi
ReplyDelete