ఈ రోజు మహాకవి శ్రీ శ్రీ వర్ధంతి. తెలుగు కవితా స్రవంతిని పేదవాడివైపు మళ్ళించి తెలుగు కవితను ఛందస్సుల బంధం నుండి విముక్తిగావించి నాలాంటి కవితా ప్రియులను లక్షలాదిగా ధైర్యంగా రాసేన్దుకు మార్గ౦ చూపిన వాడు శ్రీ శ్రీ. హీనంగా చూడకు దేన్నీ కవితామయమేనోయి అన్నీ అని వెన్నుతట్టిన మహాకవి శ్రీ శ్రీ. తాడిత, పీడిత,పతితుల, బాధా సర్ప్దద్రష్టుల వెతలను తీర్చడానికి జగన్నాధరధచక్రాలను భూమార్గం పట్టి౦చదానికి తన సాహిత్యం ద్వారానే కాక జీవితాన్నే పణంగా పెట్టినవాడు శ్రీ శ్రీ. ఈ శతాబ్దపు కవిగా ఈ యుగం నాదే అని సగర్వంగా ప్రకటించుకున్న శ్రీ శ్రీని జాతీయ కవిగా నేడైనా ప్రకటింప చేయాల్సిన అవసరం మన తెలుగువాళ్ళ బాధ్యత. సుభ్రమణ్య కవిని జాతీయ కవిగా ప్రకటింపచేసుకున్నతమిళ సోదరుల తెగువ మనకు లేకపోవడం శోచనీయం. మనవాళ్ళను మనం గుర్తించడంలో మనకు వున్నన్నిసషబిశాలు వేరెవరికీ వు౦డవనుకు౦టాను. తన జీవితకాలమంతా ప్రజల వైపు, ప్రజల పోరాటాల వైపు నిలబడి పౌరహక్కుల ఉద్యమ నాయకుడుగా, విప్లవ రచయితల స౦ఘ౦ వ్యవస్థాపకుడిగా తెలుగు సాహితీ ర౦గ౦లో అరునతారగా వెలుగొ౦దిన మహా వ్యక్తీ శ్రీ శ్రీ. ఆయన స్ఫూర్తిని కొనసగి౦చడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి . a౦దుకో శ్రీ శ్రీ మా అరుణారుణ జోహార్లు.
గుర్తు చేసినందుకు దన్యవాదాలు. హడావుడి బ్రతుకులు, గతుకుల పయనాలు. పడిలేవటానికే సగం జీవితం అంకితమీ పరుగుల పయనంలో.
ReplyDeleteబొల్లోజు బాబా గారి టపా: http://sahitheeyanam.blogspot.com/2009/06/blog-post.html చూడండి,మీకు నచ్చవచ్చు.
శ్రీ శ్రీ ని ఎవరో గుర్తించాలని అడుక్కోవడమేవిటండి?అయిననా జాతీయ అవార్డు వచ్చినప్పుడే ఆ గుర్తింపు వచ్చిందేమో కదా
ReplyDeleteఅశోక్ గారూ... శ్రీ శ్రీని ఎవరో గుర్తించాలనికాదు. తెలుగును ప్రాచీన భాషగా గుర్తింపజేసేందుకు ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో తెలియనిదికాదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ జాతీయ కవి గుర్తింపు ఒకటి కాదు. తమిళ కవి సుబ్రహ్మయ్న భారతిని దక్షిణ భారతం నుండి జాతీయ కవిగా గుర్తించారు. తెలుగులో గురజాడ, శ్రీ శ్రీలు వారికంటే తక్కువ వారుకాదు. ఒక జాతి మొత్తాన్ని మేల్కొలిపే గీతం కవితా ఓ కవితా. ఉత్తరాది వారి నిర్లక్ష్యం, తమిళుల ఆటంకం మనలను చాన్నాళ్ళుగా అన్ని రంగాలనుండి వెనక్కి నెట్టివేస్తున్నాయి. మన రాజకీయ నాయకుల తార్పుడు గుణం వలన మనకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వాలను మన ఎం.పి.ల సంఖ్య మాత్రమే నిలుపుతోంది. కాబట్టి మనం ముందు మన నిర్లిప్త ధోరణి నుండి బయటపడాలి.అశోక్ గారూ... శ్రీ శ్రీని ఎవరో గుర్తించాలనికాదు. తెలుగును ప్రాచీన భాషగా గుర్తింపజేసేందుకు ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో తెలియనిదికాదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ జాతీయ కవి గుర్తింపు ఒకటి కాదు. తమిళ కవి సుబ్రహ్మయ్న భారతిని దక్షిణ భారతం నుండి జాతీయ కవిగా గుర్తించారు. తెలుగులో గురజాడ, శ్రీ శ్రీలు వారికంటే తక్కువ వారుకాదు. ఒక జాతి మొత్తాన్ని మేల్కొలిపే గీతం కవితా ఓ కవితా. ఉత్తరాది వారి నిర్లక్ష్యం, తమిళుల ఆటంకం మనలను చాన్నాళ్ళుగా అన్ని రంగాలనుండి వెనక్కి నెట్టివేస్తున్నాయి. మన రాజకీయ నాయకుల తార్పుడు గుణం వలన మనకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వాలను మన ఎం.పి.ల సంఖ్య మాత్రమే నిలుపుతోంది. కాబట్టి మనం ముందు మన నిర్లిప్త ధోరణి నుండి బయటపడాలి.అశోక్ గారూ... శ్రీ శ్రీని ఎవరో గుర్తించాలనికాదు. తెలుగును ప్రాచీన భాషగా గుర్తింపజేసేందుకు ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో తెలియనిదికాదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ జాతీయ కవి గుర్తింపు ఒకటి కాదు. తమిళ కవి సుబ్రహ్మయ్న భారతిని దక్షిణ భారతం నుండి జాతీయ కవిగా గుర్తించారు. తెలుగులో గురజాడ, శ్రీ శ్రీలు వారికంటే తక్కువ వారుకాదు. ఒక జాతి మొత్తాన్ని మేల్కొలిపే గీతం కవితా ఓ కవితా. ఉత్తరాది వారి నిర్లక్ష్యం, తమిళుల ఆటంకం మనలను చాన్నాళ్ళుగా అన్ని రంగాలనుండి వెనక్కి నెట్టివేస్తున్నాయి. మన రాజకీయ నాయకుల తార్పుడు గుణం వలన మనకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వాలను మన ఎం.పి.ల సంఖ్య మాత్రమే నిలుపుతోంది. కాబట్టి మనం ముందు మన నిర్లిప్త ధోరణి నుండి బయటపడాలి.
ReplyDelete