ఈ ఒంటరి వేళ
నా రెక్కలు విరిగి
రెప్పలు బరువయ్యేట్టు
ఎదలో ముల్లు గుచ్చుకొని...
నీ వెండి వెన్నెల నవ్వు కోసం
ఈ అంచున నే వేచేవేళ
ఈ రేయినింక
అమవాస చేయకు...
వెలితి ఎప్పుడూ ఆకాశమంత
విస్తరిస్తూనే వుంటుంది..
ఆశ ఎప్పుడూ నక్షత్రంలా
మిణుకు మిణుకు మంటూనె వుంటుంది....
ఎండిన గొంతును చేరిన
వాన చినుకు తడిపినంత మేరా
మరల ఎండ ఆరబెడుతూనే వుంటుంది...
నా రెక్కలు విరిగి
రెప్పలు బరువయ్యేట్టు
ఎదలో ముల్లు గుచ్చుకొని...
నీ వెండి వెన్నెల నవ్వు కోసం
ఈ అంచున నే వేచేవేళ
ఈ రేయినింక
అమవాస చేయకు...
వెలితి ఎప్పుడూ ఆకాశమంత
విస్తరిస్తూనే వుంటుంది..
ఆశ ఎప్పుడూ నక్షత్రంలా
మిణుకు మిణుకు మంటూనె వుంటుంది....
ఎండిన గొంతును చేరిన
వాన చినుకు తడిపినంత మేరా
మరల ఎండ ఆరబెడుతూనే వుంటుంది...
ఏదో వేడి గాడ్పు వీచిన వేళ
నీ చిరునవ్వొకటి
ఓదార్పునిస్తుంది కదా ప్రియతమా...
అది ఋణమో లేక
సుదీర్ఘ నిరీక్షణా ఫలమో కదా...
కాదా?
ఏవో ఏవేవో సుడిగుండాల
మాటున చినిగిన తెరచాపల పయనం
తీరం చేరక ఒడ్డున ఒరిగిపడిన
జనమ జనమల బంధం...
మరల మరల
ఈ ఎదలోపలి శూన్యాన్ని
పూరింప తన కోసం
ఎన్నటికీ తెగని
ఈ నిరీక్షణ...
నిర్వేదం కానీయక
ఈ వేళ
నా గాయాల మాన్ప
నీ వేణువు పిలుపు కోసం...
నువ్వా? నేనా??
అంటూ
ఈ ప్రశ్నల కొడవళ్ళతో
కాలాన్ని కోయక
నను నీ బంధీని చేయగ రావా
ప్రియా..
నీ చిరునవ్వొకటి
ఓదార్పునిస్తుంది కదా ప్రియతమా...
అది ఋణమో లేక
సుదీర్ఘ నిరీక్షణా ఫలమో కదా...
కాదా?
ఏవో ఏవేవో సుడిగుండాల
మాటున చినిగిన తెరచాపల పయనం
తీరం చేరక ఒడ్డున ఒరిగిపడిన
జనమ జనమల బంధం...
మరల మరల
ఈ ఎదలోపలి శూన్యాన్ని
పూరింప తన కోసం
ఎన్నటికీ తెగని
ఈ నిరీక్షణ...
నిర్వేదం కానీయక
ఈ వేళ
నా గాయాల మాన్ప
నీ వేణువు పిలుపు కోసం...
నువ్వా? నేనా??
అంటూ
ఈ ప్రశ్నల కొడవళ్ళతో
కాలాన్ని కోయక
నను నీ బంధీని చేయగ రావా
ప్రియా..
చాలా బాగుందండి వర్మ గారు!
ReplyDeleteథాంక్సండీ జలతారువెన్నెలగారూ...
DeleteNice one!!
ReplyDeleteThank You వనజవనమాలి గారూ..
Deleteవర్మగారు...నిరీక్షణలో ఇంత అందమైన భావాలతో మమ్మల్ని బంధిస్తున్నారు కదా!
ReplyDeleteఆమె....తో బంధీ అయినవేళ ఈ భావాలకి మేము దూరం అవుతామో కదా!:-)
పద్మార్పిత గారూ ఆమె....తో బందీ కాదండీ జుగల్బందీతో మిమ్మల్ని మరింతగా అలరిస్తాను లెండి..:-)
Deleteవెలితి ఎప్పుడూ ఆకాశమంత
ReplyDeleteవిస్తరిస్తూనే వుంటుంది..
ఆశ ఎప్పుడూ నక్షత్రంలా
మిణుకు మిణుకు మంటూనె వుంటుంది....
intha chakkaga raasinanduku,congrats sir.
ధన్యవాదాలు భాస్కర్జీ...
Deleteమీరు నీడలో ఉంటేనేకదా తనకి నీడనివ్వగలరు అందుకే మీరు వేసుకోండి గొడుగు
ReplyDeletethis comment is regarding pic.
Nice poetry Boss.
Thanks for your kind suggestion Aniketh..:-)
Delete