నువ్వు నిర్మించిన
ఆకాశపు నిచ్చెన
చేరలేని
ఈ నిస్సహాయత
వెనకే
నీడలా
వెంటాడుతోంది...
అహర్నిశలూ
నీకంటూ
ఏమీ మిగుల్చుకోని
క్షణాలతో
నీవల్లిన
ఈ గుజ్జనగూళ్ళు
నిర్లక్ష్యపు
చెదపట్టి
ఒట్టిపోయినాయి...
చేతుల్బార్లా జాపి
నీ భుజాన
ఈ భారాన్నంత మోస్తూ
నీవీదిన
ఈ అనంత సాగరం
నీ మనోబలం ముందు
చిన్నబోయినాది...
తండ్రీ
నేడు నా
కన్నీటి గూటిలో
ఓ నెత్తుటి చుక్కను
నైవేధ్యంగా
సమర్పించుకుంటున్నా...
“వెన్నల, దారి”ని
ReplyDeleteఆక్రమిస్తూ,
గుండె పొరల్లో చొరబడింది.
నిశ్శబ్ధంగా.
veelunte choodandi ee naaneeni,
5 blogulu - 5 naaneelalo
Thank u the tree gaaru..మీ నానీలలో నా బ్లాగును కలిపినందుకు..
Deleteమీ తీరని వెలితి కొలిమిలో మండి ఉదయించిన వేదనని వడ్డించారుగా "నైవేధ్యం" లా...
ReplyDeleteథాంక్యూ పద్మార్పితగారూ..ఇది ఎన్నటికీ తీరని వెలితే కదా..మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..
Deleteప్రణామం...తండ్రిగారికి
ReplyDeleteThank You Aniketh for sharing with me..
Delete