లేదు మొఖాన ఏ ముసుగూ
లేను ఏ తెర వెనుకా...
కాసింత ప్రేమగా పలుకరిస్తే చాలన్న
దాహమే నన్ను నీ స్నేహానికి దగ్గర చేసింది...
ఎలావున్నావు అన్న మాట కదా
నన్ను నీ దరికి చేర్చింది...
ఎన్నో యుగాలుగా బీడైన హృదయపు
నేలపై కురిసిన తొలకరి జల్లులా నీ పలుకరింపు...
చిగురించిన స్నేహపు లేలేత తొడిమ
నీ చేతిలోనే వుంది...
తుంచి వేస్తావో? లాలనగా తడిమి
అక్కున చేర్చుకుంటావో...
కరిగిపోతున్న నా కాలపు కొవ్వొత్తి
చివరాఖరి వెలుగుతో నీకు హారతిద్దామని...
లేను ఏ తెర వెనుకా...
కాసింత ప్రేమగా పలుకరిస్తే చాలన్న
దాహమే నన్ను నీ స్నేహానికి దగ్గర చేసింది...
ఎలావున్నావు అన్న మాట కదా
నన్ను నీ దరికి చేర్చింది...
ఎన్నో యుగాలుగా బీడైన హృదయపు
నేలపై కురిసిన తొలకరి జల్లులా నీ పలుకరింపు...
చిగురించిన స్నేహపు లేలేత తొడిమ
నీ చేతిలోనే వుంది...
తుంచి వేస్తావో? లాలనగా తడిమి
అక్కున చేర్చుకుంటావో...
కరిగిపోతున్న నా కాలపు కొవ్వొత్తి
చివరాఖరి వెలుగుతో నీకు హారతిద్దామని...
చాలా బాగుందండి.
ReplyDeleteThank you జలతారువెన్నెల గారు..
Deleteఏ మర్మమెరుగని స్నేహాన్ని ఆలంబనతో అక్కున చేర్చుకుంటారే కానీ హారతికై ఆశించరేమో కదాండి!!!
ReplyDeleteYour way of expressing is so nice Varmaji...
నిజమేనా పద్మగారూ..
Deleteథాంక్సండీ..