అలా కూచున్న చోటనే
చెదలు పడుతున్నా కదలనితనం...
నిప్పులు కురిపిస్తున్న ఎండ పట్టినా
దాటు దాటనితనం...
కుంభవృష్టిగా వాన కురిసినా
చెక్కు చెదరనితనం....
గడ్డ కట్టుతున్న చలిపులి వణికిస్తున్నా
కాలు కదపనితనం...
ఏదో వెంటాడుతూ
మనసంతా అలికిడిలేనితనం...
నన్ను నేను ఆవిష్కరించుకోలేక
మూగబట్టినతనం...
అవును ఇది
గుండె అంచుల కరకుదనం...
మైలు రాయి విరిగిన చోట
ఆగిన పయనం...
ఈ నాచు పట్టినదనం
విదిల్చే నీటి బిందువుపై
ఓ నీరెండ ప్రతిఫలిస్తే???
ఈ నాచు పట్టినదనం
ReplyDeleteవిదిల్చే నీటి బిందువుపై
ఓ నీరెండ ప్రతిఫలిస్తే???
వేయి వెలుగుల ఇంద్రధనుస్సు
ఆశల రంగులు నింపి
చెదలను దులిపి
ఎండకూ వానకూ గొడుగు పట్టి
మూగ గుండెకు మాటలు నేర్పి
కరుకుదనం కారుణ్యం లో కరిగిస్తుంది..
విరిగిన మైలు రాయికి అతుకుపెట్టి
పయనం వైపు వేలు చూపిస్తుంది
మేడం ఎన్నాళ్ళకు మీ రాక..వస్తూనే స్ఫూర్తిని నింపిన వ్యాఖ్యానంతో దారి చూపిన మీకు ధన్యవాదాలు..
DeleteSimply superb!! చిత్రం కూడా చాలా బాగుంది.
ReplyDeleteమీ కవితలన్ని బూక్ గా చేసుకుని చదుకోవాలని ఉంది!!
ఏవండోయ్....నాకు ఒక కాపీ ఇస్తారు కదా!
Deleteపుస్తకావిష్కరణకు రాలేకపోయినా? :-):-)
@జలతారు వెన్నెలగారూ..మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదలండీ...పుస్తక ప్రచురణ కాగానే తప్పక అందజేస్తాను..
Delete@పద్మార్పితగారూ..మీరు హాజరు కాకపోతే ఆవిష్కరణెక్కడ జరుగుతుంది..తప్పించుకుందామనే..:-)
పద్మార్పిత గారు, నేను కాఫీ ఇస్తాను, వర్మ గారు కాపీ ఇస్తారు.. How about that? :))
DeleteExcellent Varmagaru.
ReplyDelete@nsmurty: Thank you Sir..
DeleteThis is an Master piece of yours...Pic is too good.
ReplyDeletewow...Thanks a lot for your kind and inspiring words Padmarpita garu..
DeleteWonderful Varmagaru.
ReplyDeleteThank you Yohanth..
Deleteనన్ను నేను ఆవిష్కరించుకోలేక
ReplyDeleteమూగబట్టినతనం...
chaalaa chakka ga raasaarandi,
thank you.
Thenak you Bhaskarji..
Deletechaalaa baagundi varma gaaroo!
ReplyDelete@sri
ధన్యవాదాలు @శ్రీ గారూ..
Deleteమిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టం అనుకున్నా
ReplyDeleteమీ కరుకుదనంలో ఇంత కోమలత్వమా
చాలా చాలా బాగుందండి.
ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు థాంక్యూ అనికేత్...
Deleteగుండె అంచుల కరకుదనం...
ReplyDeleteమైలు రాయి విరిగిన చోట
ఆగిన పయనం...
Jayasree NaiduJune gari konasagimpu naku baaganachindhi
ఈ నాచు పట్టినదనం
విదిల్చే నీటి బిందువుపై
ఓ నీరెండ ప్రతిఫలిస్తే???
వేయి వెలుగుల ఇంద్రధనుస్సు
ఆశల రంగులు నింపి
చెదలను దులిపి
ఎండకూ వానకూ గొడుగు పట్టి
మూగ గుండెకు మాటలు నేర్పి
కరుకుదనం కారుణ్యం లో కరిగిస్తుంది..
విరిగిన మైలు రాయికి అతుకుపెట్టి
పయనం వైపు వేలు చూపిస్తుంది
Ramakrishna.A గారూ ఇలా నా రాతలు చదివి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్..
Deleteచాలాబాగారాసారండి, మరిన్ని మీనుండి కోరుతూ...
ReplyDeleteమీరిలా ప్రేరణనందిస్తే తప్పకుండా ప్రేరణగారూ...థాంక్యూ..
Deleteచాలా బాగుంది.. వర్మగారు..
ReplyDeleteసాయి గారు థాంక్యూ...
Deletesir eppatilaage kavitha baagundi
ReplyDeleteThank you fathimaji..
Delete