Friday, June 29, 2012

కలుపుకు పో!!!


అప్పుడే లాలించే తల్లిలా దగ్గరకు తీసుకుంటావు
అంతలోనే అలా విదిలించి వదిలేస్తావు....
అప్పటికప్పుడే కరిగిపోయె మనసుతో మరులొలికిస్తావు
ఇంతలోనే మునిలా ముడుచుకుపోతావు....

రా!!! రమ్మని రాగ దీపం వెలిగిస్తావు
వచ్చేలోపే మూడో కన్ను తెరుస్తావు....
అయినా పాలనురుగులాంటి నీ మనసు నాకు తెలీదా
ఆప్యాయతానురాగాల వెల్లువ కనబడనీయకుండా దాచే
నీ విఫలయత్నం నవ్వులు విరిసే నీ కన్నులు దాయలేవు కదా!!!

ప్రియా!!! నీవు మౌనమైన క్షణాలన్నీ నా మృత ఫలకాలే....
అవి నా సమాధి పై పేర్చబడుతున్న రాళ్ళే కదా!!!
గల గల పారే గోదావరి ఉరవడిలో నన్ను కలుపుకు పో
ఈ వరమొక్కటివ్వు చాలు నాకు....
ఆజన్మాంతం నీ పాదాక్రాంతుడినై వుంటా!!!

12 comments:

 1. Nice, భావన చక్కగా అక్షరాల్లో ఇమడ్చగలిగారు!

  ReplyDelete
  Replies
  1. థాంక్సండీ చిన్ని ఆశ గారూ...

   Delete
 2. goppaga raasaarandi, naku nachindi.

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానానికి ధన్యవాదాలు భాస్కర్జీ..

   Delete
 3. కవిత చాలా బాగుందండి.
  మృత ఫలకాలు, సమాధి ఇలాంటి పదాలు ఎందుకండి వర్మ గారు!!

  ReplyDelete
  Replies
  1. భావానికి తగ్గట్టు వాడాలి కదండీ...
   ధన్యవాదాలు వెన్నెలగారూ..

   Delete
 4. మీ కవితాజోరు చాలదా కలలయామినికి..
  మీరు పాదాక్రాంతుడు అవనేలామెకి?? :-)

  ReplyDelete
  Replies
  1. అలా అయినా కనికరిస్తుందేమొనని..:-)
   థాంక్సండీ పద్మార్పితగారూ..

   Delete
 5. సర్, మొదటి నాలుగు లైన్లు అద్భతంగా ఉన్నాయి. అందమైన కవిత.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు ఫాతిమాజీ..

   Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...