ఇప్పుడెందుకో నడుస్తున్న ప్రతివాడూ
ఒక్కో జెండాలా కనబడుతున్నాడు...
ఎవరికి వారే ఓ సమూహంలో
చిక్కుకుపోయినట్టు...
ఎవరికి వారే చేతులూపుతూ
పగ్గాలు బిగించి పరుగెడుతున్నట్టు...
ఎవరికి వారే తమలో తామే
ఏదో దీర్ఘ ఉపన్యాసమిస్తున్నట్టు....
ఎవరికి వారే ఒక్కొక్కరుగా
ఆయుధమై నీడతో యుద్ధం చేస్తున్నట్టు...
ఎవరికి వారే గుంపుగా పోగై
ఒక్కొక్కరుగా కుప్పబడినట్టు...
ఎవరికి వారే రెక్కలు పూన్చి
గోడలు పగులగొట్టి ఎగురుతున్నట్టు...
ఎవరికి వారే తమలోలోపల్లోకి
తుపాకీ పేల్చుకొని హత్యగావింపబడ్డట్టు....
ఒక్కో జెండాలా కనబడుతున్నాడు...
ఎవరికి వారే ఓ సమూహంలో
చిక్కుకుపోయినట్టు...
ఎవరికి వారే చేతులూపుతూ
పగ్గాలు బిగించి పరుగెడుతున్నట్టు...
ఎవరికి వారే తమలో తామే
ఏదో దీర్ఘ ఉపన్యాసమిస్తున్నట్టు....
ఎవరికి వారే ఒక్కొక్కరుగా
ఆయుధమై నీడతో యుద్ధం చేస్తున్నట్టు...
ఎవరికి వారే గుంపుగా పోగై
ఒక్కొక్కరుగా కుప్పబడినట్టు...
ఎవరికి వారే రెక్కలు పూన్చి
గోడలు పగులగొట్టి ఎగురుతున్నట్టు...
ఎవరికి వారే తమలోలోపల్లోకి
తుపాకీ పేల్చుకొని హత్యగావింపబడ్డట్టు....
నాకు అలాగే అనిపిస్తుందండి!
ReplyDeleteచాలా బాగుంది...
@జలతారువెన్నెల గారూ మీ సహానుభూతికి ధన్యవాదాలండీ..
Deleteee kavita baagundi
ReplyDelete@Murty: Thank you..
Delete"ఎవరికి వారే తమలోలోపల్లోకి
ReplyDeleteతుపాకీ పేల్చుకొని హత్యగావింపబడ్డట్టు"
ఈ లైన్స్ బాగా నచ్చాయండి...
కనీసం తమని తాము హత్యచేసుకునే
ధైర్యమైనా ఉందంటారా? Well said.
@Padmarpita గారూ ఇటీవల పెరుగుతున్న ఆత్మహతలు చూస్తున్నాం కదా..Failure of modern life style crush ourselves..:-(
DeleteThanks for your compliment to my lines...
నిజమే మీరన్నట్టు సరిగ్గా చూస్తే ప్రపంచం అంతా ఇలానే (క)అనిపిస్తుంది...
ReplyDeleteభావాన్ని కవితలో చాలా బాగా చెప్పగలిగారు.
@చిని ఆశః ధన్యవాదాలండీ..
Deletemanashi manasthatyam paina raasina manchi kavitha.
ReplyDelete@భాస్కర్జీ ధన్యవాదాలు..
Deleteప్రపంచం నుండి తనని తానూ వెలివేసుకుని.. శూన్యం లో నుండి శూన్యం లోకి ప్రయాణిస్తున్న మనిషి తత్త్వం గురించి చాలా చాలా బాగా వ్రాశారు. ..
ReplyDelete@వనజవనమాలిః మీ విశ్లేషణాత్మక స్పందనకు థాంక్సండీ...
Deleteఎవరికి వారే ఒంటరిపొరాటం అన్నమాట...బాగుందండి!
ReplyDelete@ప్రేరణ గారు.. థాంక్సండీ...
Deleteఇప్పుడెందుకో నడుస్తున్న ప్రతివాడూ
ReplyDeleteఒక్కో జెండాలా కనబడుతున్నాడు...
ee lines nachchayandi.
Thank you sairam...
Delete