నాన్న...
నాన్నా!
ఆ పిలుపులోనే
ఓ ఆలంబన దాగుంది కదా...
జీవితపుటెడారిలో
ఎప్పుడూ
తను ఓ ఒయాసిస్సు...
నీ గెలుపువోటములను
గుండెల్లో
పదిలపరచుకునే
ఓ జీవన మాధుర్య భాండాగారం...
ఆతని చేయెప్పుడూ
నిరంతరమూ
ఆశీర్వచనం కాదా...
రెక్కలు వచ్చిన పిల్లను
వదిలి పక్షి వుండగలదేమో
కానీ
తనంత ఎదిగిన పిల్లలను కూడా
యింకా తన బాహువులలో
బంధించాలన్న తన తహతహ తీరనివాడు...
ఎగిరి వెళ్ళి ఆవల తీరాన చేరిన
వాళ్ళనింకా ఆశగా తన చివరాఖరి
ఊపిరి దాకా ఎదురుచూసే ఆశావాది...
తండ్రీ నీకు వేన వేల వందనాలు...
happy fathers day, good one,
ReplyDeletekavitha - 2011 lo mee kavitha unnatlu, jyothi sunday book lo vachhindi,congrats
Thank you Bhaskarji...
Deleteనాన్న మనసును చాలా బాగా వర్ణించారు... సూపర్ వర్మగారు....
ReplyDeleteథాంక్యూ సాయిగారూ...
Deletebaavundandi miku happy fathers day
ReplyDelete@చెప్పాలంటేః..థాంక్యూ వెరీ మచ్..
Delete"నాన్నా!
ReplyDeleteఆ పిలుపులోనే
ఓ ఆలంబన"
this is enough....
ఒక్క ముక్కలో ఎంతబాగాచెప్పారో!
థాంక్యూ అనికేత్..:-)
Deleteవర్మ గారు ,
ReplyDeleteమంచి కవిత ....నాన్న మనసుని చక్కాగా ఆవిష్కరించారు ...
చాలా బాగుంది .
ధన్యవాదాలండీ సీత గారు...
Deleteచాలా బాగుంది వర్మ గారూ!
ReplyDeletehappy father's day to you.
@శ్రీ
Thank you very much and same to you Sree gaaru..
Delete