Friday, June 22, 2012

తలపుల టపా..

నీ కనురెప్పల వాకిట వాలిన
నా తలపుల టపా....
ఒక్కసారి తలపుల తలుపులు
తెరిచి చూడవా ప్రియా....

నీ ఊపిరి వేడి సోకని వేళ
నా దేహమంతా లావా పొంగి పొర్లినా
హిమాలయాలమల్లే చల్లబడుతుంది కదా....

మత్తుజల్లీ మరులొలికే
మమతానురాగాల జాజిమాల్లి తీగలా
అల్లుకు పోయే నీవు
దూరమైన వేళ
స్వర్గారోహణమైనా
నరకప్రాయమే కదా....

నీ అధరాల ఎరుపుదనమద్దిన
పడమటి సంధ్య....
వెన్నెల రాకతో మరులు గొలుపుతూ
ఆహ్వానం పలుకుతూ....
బిగి కౌగిట బందీ చేసి
ఏదో మిగిలి వున్న ఋణాన్నితీర్చుకుంటూ
సిగ్గు దొంతరైంది ఆకాశం.....

24 comments:

  1. Sweet!!! Talapula Tapaa naaku bhale nachesindandi....

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చిందన్నందుకు ధన్యవాదాలండీ వెన్నెలగారూ ..:-)

      Delete
  2. చక్కని భావానికి
    చక్కని చిత్రాన్ని జత చేసారు వర్మ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  3. శ్రీ గారూః Thanks for your kind compliment Sir ..

    ReplyDelete
  4. chaala chakkani chitram
    chikkanaina bhaavam....
    chilipiga dochindi hrudayam!

    ReplyDelete
    Replies
    1. సృజన గారు మీ హృద్యమైన స్పందనకు ధన్యవాదాలండీ..

      Delete
  5. చాలా చాలా బాగుంది వర్మ గారు...
    Pic కూడా మీ కవిత ఉన్నంత అందంగా ఉంది...

    ReplyDelete
  6. వర్మ గారు...చాలా బాగుంది...:)

    ReplyDelete
  7. Replies
    1. the tree: భాస్కర్ గారూ థాంక్యూ..

      Delete
  8. తలపుల టపా తెరచిచూడని మీరు ఇంతందంగా చెపితే దరిచేరదా చెప్పండి:-)
    చాలా చాలా బాగుంది....చిత్రం కూడా!

    ReplyDelete
    Replies
    1. దరి చేరితే ఇంక ఆనందార్ణవమే కదండీ పద్మార్పిత గారూ...మీ ఆత్మీయ స్పందనకు థాంక్యూ..:-)

      Delete
  9. wowwwwwwwwwwwwwwwwwwww..............absolutely romantic....loved it varma ji :-)

    ReplyDelete
  10. బ్యూటిఫుల్....మీహృదయం ప్రేమమయం!:)

    ReplyDelete
    Replies
    1. మీ అందమైన స్పందనకు ధన్యవాదాలు అనికేత్..:)

      Delete
  11. చాలాబాగుందండి కవిత మరియు చిత్రం.

    ReplyDelete
    Replies
    1. ప్రేరణగారూ థాంక్సండీ..

      Delete
  12. వర్మగారు,మీ కవిత చాలబావుంది

    తలపుల టపా లోని అక్షరాలు వెన్నెల ధార ని పానం చేసి కవితామృతాన్నిచవిచూపించ్గాయి.
    ఆ అమృతధారలో తడిసి ముద్దయ్యి నా మానసం విహంగం లా ఎక్కడికో సుదూర తీరాలకు సాగిపోతోంది

    .......ఫల్గుణి

    ReplyDelete
    Replies
    1. పూర్వ ఫల్గుణి గారూ మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ..

      Delete
  13. varmaajee chakkani bhaavana ,vyaktaparichaaru

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...