Thursday, August 28, 2014

వాన కడిగిన గోడ


రావి ఆకు చివర వేలాడే నీటి బొట్టు 
స్ఫటికత కనులకింత ఓదార్పునిస్తూ

మొనదేలిన గడ్డి పోచ 
పచ్చగా వాన నీటిలో నిటారుగా ప్రతిఫలిస్తూ

తార్రోడ్డుపై నల్లగా నిగనిగలాడే 
తడితనం రిక్షా టైరుపై మరకలా మెరుస్తూ

తడిచిన కాకి గూడు చేరలేక 
దాగిన బ్రహ్మజెముడు పొద బయటపడేస్తూ

తడిచిన దేహంతో పరుగున 
దూడ తల్లి పొదుగులో దాగిపోతూ

వాన కడిగిన ఈ జైలు గోడపై ఆకాశాన్నింత దోసిట్లో 
పోసి పావురం బొమ్మ వేస్తూ....


6 comments:

  1. తార్రోడ్డుపై నల్లగా నిగనిగలాడే
    తడితనం రిక్షా టైరుపై మరకలా మెరుస్తూ..nice

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...