కొన్ని ఊదారంగు మేఘాలేవో కమ్ముకుంటూ
ఈ ఒంటరి గోడపై బొమ్మ గీస్తున్నాయి...
ఆమె మునివేళ్ళ చుట్టూ ఏదో వలయాకారంగా
ఊదారంగు కాంతి పరచుకుంటుంది...
కను రెప్పలపై ఓ ఊదారంగు సీతాకోక చిలుక వాలి
దిగులుతనాన్ని అద్దింది...
నల్ల గేటు చుట్టూ అల్లుకున్న ఊదారంగు కాగితప్పూలు
నేల రాలి వాన నీటిలో కరిగిపోతున్నాయి...
ఇంతలో ఊదారంగు గౌను వేసుకున్న పిల్ల నవ్వుతూ
నీటిని పడవలుగా మార్చి దారి చూపుతూంది...
మొత్తం తడిసిపోయింది కదా! :-)
ReplyDeleteవానలో తడవలేదా మీరు? థాంక్యూ ఫర్ కామెంటింగ్..:-)
Deleteకను రెప్పలపై ఓ ఊదారంగు సీతాకోక చిలుక వాలి
ReplyDeleteదిగులుతనాన్ని అద్దింది...బాగుంది
ధన్యవాదాలు సాంధ్యశ్రీ గారు...
Delete:-):-)
ReplyDeleteథాంక్యూ కార్తీక్ గారు.. అప్పుడప్పుడు ఇలా వచ్చి నవ్వుతు ఉండండి..:-)
ReplyDeleteసారూ....గౌను రంగు వెలిసేలా తడిపేసారు :-)
ReplyDelete