Sunday, September 7, 2014

ఊదారంగు గౌను..


కొన్ని ఊదారంగు మేఘాలేవో కమ్ముకుంటూ 
ఈ ఒంటరి గోడపై బొమ్మ గీస్తున్నాయి...

ఆమె మునివేళ్ళ చుట్టూ ఏదో వలయాకారంగా 
ఊదారంగు కాంతి పరచుకుంటుంది...

కను రెప్పలపై ఓ ఊదారంగు సీతాకోక చిలుక వాలి 
దిగులుతనాన్ని అద్దింది...

నల్ల గేటు చుట్టూ అల్లుకున్న ఊదారంగు కాగితప్పూలు 
నేల రాలి వాన నీటిలో కరిగిపోతున్నాయి...

ఇంతలో ఊదారంగు గౌను వేసుకున్న పిల్ల నవ్వుతూ 
నీటిని పడవలుగా మార్చి దారి చూపుతూంది...

7 comments:

  1. మొత్తం తడిసిపోయింది కదా! :-)

    ReplyDelete
    Replies
    1. వానలో తడవలేదా మీరు? థాంక్యూ ఫర్ కామెంటింగ్..:-)

      Delete
  2. కను రెప్పలపై ఓ ఊదారంగు సీతాకోక చిలుక వాలి
    దిగులుతనాన్ని అద్దింది...బాగుంది

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సాంధ్యశ్రీ గారు...

      Delete
  3. థాంక్యూ కార్తీక్ గారు.. అప్పుడప్పుడు ఇలా వచ్చి నవ్వుతు ఉండండి..:-)

    ReplyDelete
  4. సారూ....గౌను రంగు వెలిసేలా తడిపేసారు :-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...