Saturday, September 29, 2012

మౌనం..


ప్రియమైన మౌనమా
నువ్వింత శిలాకారమా...

నిశ్శబ్ధం నిరామయతనం
సమాధితనం కాదా....

ఒంటరితనం వెంటాడే
ఖాళీతనంకంటే కరకుతనముందా....

సవ్వడి చేయని మువ్వ
గాలినికోస్తూ పగుల్లబారుతూ...

గడ్డకట్టిన కాలం అంచున
మంచుబారుతూ...

రెక్కరాలిన పువ్వొకటి
నొసటిపై మృధువుగా తాకుతూ...

ఈ నిషాద నీరవ నిశ్శబ్ధాన్ని
చీలుస్తూ తెగిపడిన తీగ...

గొంతుకడ్డంపడ్డ వాగ్థానం
ఉరిముడి పడుతూ ఊపిరిసలపనితనం..

20 comments:

  1. "ఈ నిషాద నీరవ నిశ్శబ్ధాన్ని
    చీలుస్తూ తెగిపడిన తీగ..." ఏ వాక్యానికా వాక్యం ఓ గ్రంధం, ఓ కావ్యం వర్మాజీ. ఎందుకో చెప్పలేను కానీ ఈ కవిత చాలా అర్ద్రంగా ఉంది.మనసు చెమ్మగిల్లేంత.అభినందనలు

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ పద స్పర్శతో ఉత్తేజాన్నిచ్చారు వాసుదేవ్జీ...ధన్యవాదాలు..

      Delete
  2. నిజమే మౌనం చాలా కటినం ...

    ReplyDelete
    Replies
    1. మీ ఏకీభావంతో నమ్మకమిచ్చినందుకు ధన్యవాదాలు శశికళ గారూ...

      Delete
  3. prathi line chaalaa andamgaa present chesaru superb sir

    ReplyDelete
  4. మీ మౌనం కూడా ఇంత అందమైన భావాలని పలికిస్తుందనుకుంటే అప్పుడప్పుడు ఇలా కూడా బాగుందండి:-)

    ReplyDelete
    Replies
    1. అవునా...కానీ ఆత్మీయుల నిశ్శబ్ధం భరించరానిది కదా పద్మార్పిత గారూ...
      మీ పలకరింపునకు ధన్యవాదాలు...:-)

      Delete
  5. మౌనం కూడా ఎన్నో భావాలను పలికిస్తుందంటారు.కానీ ఇష్టపడ్డ వారి మౌనం మరింత బాధను కలిగిస్తుంది.మీ కవిత మౌనం లోని ఆవేదనను చక్కగా పలికించింది.

    ReplyDelete
    Replies
    1. నా కవితలోని అంతరార్థాన్ని స్పృశిస్తూన్న మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ రవిశేఖర్ గారూ...

      Delete
  6. నిశ్శబ్ధంలో నిగూఢమైన ప్రేమ దాగుంటుందంటండీ......అదికూడా అనుభవన్నమాట:)

    ReplyDelete
    Replies
    1. అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎంత బాధగా వుంటుందొ అనికేత్...థాంక్యూ..:)

      Delete

  7. వర్మ గారూ, మౌనం అర్ధ అంగీకారం అంటారు.
    ఏమైనా మౌన భాష చాలా విలువైనది.

    ReplyDelete
    Replies
    1. నిజమే మీరన్నది ఫాతిమాజీ...థాంక్యూ.

      Delete
  8. At times we shared a bunch of silences together, indistinct.
    thankyou silence, being part of our friendship.

    ReplyDelete
  9. "రెక్కరాలిన పువ్వొకటి నొసటిపై మృధువుగా తాకుతూ...
    ఈ నిషాద నీరవ నిశ్శబ్ధాన్నిచీలుస్తూ తెగిపడిన తీగ..."

    నిశ్శబ్ద యుద్ధం నిజంగా మరణసదృశమే...మనసు తేటితీగ తెగిపడిన భావమే....కానీ ఆ నిశ్శబ్దం పగిలిన వేళ అనుభూతుల జలపాతాల హోరులో తడిసి ముద్దైన హృదయం....అది మళ్ళీ మళ్ళీ కావాలనిపించే....(ఇక నే చెప్పను....అక్షరాలకు ఒయారాలద్దుతారు గా ఈ కవివర్మ ...అర్ధం చేసుకుని పూరించేసుకోండి...ఎందుకంటే ఆ నిడివిని పూర్చే జాణతనం నాకడ లేదు...)

    ReplyDelete
  10. మీ ఆత్మీయ స్పందనతో మౌనానికి భాషనిచ్చారు పద్మా శ్రీరాం గారు...ధన్యవాదాలు...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...