Monday, September 3, 2012

డర్టీ పిక్చర్...

కాళ్ళకు కలల చక్రాలు తగిలించుకొని
మోహపు దుప్పటి కప్పుకొని
నింగిలో తారలా మెరవాలని
మెరీనా వైపు ఎఱంచు నల్ల పరికిణీతో పరుగులిడి
నీటిని వీడిన చేపలా
కంగారుగా వచ్చి
వెండి తెరపై దేహపు కళ్ళను పరిచి
ఎందరికో నిద్ర లేని రాత్రుళ్ళు పంచి
నీ నవ్వు నడుము వంపు వయాగ్రాలా మింగిన
ఈ లోకం నిన్ను దహిస్తూ శాపగ్రస్తురాలైంది...

నిద్రకు వెలియై మనసు మంచు గడ్డ కట్టి

అసూయపు కత్తులతో వెన్నంతా గాట్లుపడి
ఒక్కదానివే కుప్పలా పడి
నేలలో ఇరిగిపోయిన నీ ఉచ్వాశ నిశ్వాశల వేడికి
వీడ్కోలు కనీటి వీడ్కోలు ఓ అప్రియ నేస్తమా...

(నిన్న డర్టీ పిక్చర్ చూసి కళ్ళు చెమర్చి యిలా సజీవ నటి సిల్క్ స్మితకు నీరాజనాలతో....జయహో విద్యాబాలన్)

18 comments:

 1. she is an great actress.
  Nice feel of yours sir.

  ReplyDelete
 2. Superbly written ,

  ReplyDelete
 3. చాలా రోజులక్రితం విడుదలై అందరి ప్రసంశల్ని అందుకున్న ఆ ప్రాత్రకి మీరు ఈ కవితద్వారా నూతన అందాన్నిచ్చారు.

  ReplyDelete
  Replies
  1. అవును అనికేత్...నేనప్పట్లో మిస్సయ్యా...అందుకే మా ఊరు 2nd release రాగానే చూసా...మీ అభిమాన స్పందనకు థాంక్యూ...

   Delete
 4. బాగారాసారండి!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సృజన గారూ...

   Delete
 5. గ్రేట్ ఫెల్! బాగుందండి. ఆర్ద్రత నింపుకున్న అక్షరాలూ..స్పందనవి..
  ప్రతి కవితలోనూ ఇవే చూడాలనుకుంటాను. ఓ..కవితాభిమానిగా..

  ReplyDelete
  Replies
  1. ఓహ్...మీ అభిమానాన్ని వమ్ము చేయను వనజవనమాలి గారూ..మీ కవితాత్మీయతకు ధన్యవాదాలు...

   Delete
 6. ఆ చిత్రాన్ని చూసి వ్యాకులత చెందిన మీ మనసు ప్రతివాఖ్యంలోను ప్రస్ఫుటమై కనిపిస్తుందండి.

  ReplyDelete
  Replies
  1. థాంక్సండీ ప్రేరణ గారూ...

   Delete
 7. పక్కింటివాడు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటేనే "ఎవరు ఎలా పోతే మనకెందుకు" అని అనుకునే వ్యక్తివాద సమాజం మనది. కానీ ఒక సినిమా నటి ఒక నటుడితోనో, దర్శకుడితోనో డేటింగ్ చేసిందని వార్త రాగానే దాన్ని మసాలా వార్తని చూసినట్టు చూస్తారు. పక్కింటిలో ఉన్నవాళ్ళ వ్యవహారాలు తమకి అనవసరం అని అనుకునేవాళ్ళకి ఎక్కడో వందల కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్‌లోనో, మద్రాస్‌లోనో ఉన్న సినిమావాళ్ళ వ్యవహారాలతో పనేమిటి?

  ReplyDelete
  Replies
  1. ఏమిటో ఈ తిక్క లాజిక్. పక్కింటి, పొరుగింటి, హాలివుడ్, బాలివుడ్ అని కాదు, మనకు నచ్చిందా లేదా అనేది ముఖ్యం. సామ్యవాదం నీతులు చెబుతావుకాని నీవు A/C train లలో తిరుగుతున్నావా లేదా? ఇక మాట్లాడక, నీవు సమర్థించుకుంటావని నాకు తెలుసు.

   Delete
 8. మసాలా పత్రికలలో వచ్చిన కథనాలు ఆధారంగా నిర్మించిన సినిమాని ఎంత వరకు నమ్మగలం? మందాకిని దావూద్ ఇబ్రహీంతో లేచిపోయిందని కథనాలు వచ్చాయి. కానీ మందాకిని ఇప్పటికీ తన భర్తతోనే కలిసి ఉంటోంది. దావూద్ ఇబ్రహీం సినిమా నిర్మాతలకి అప్పులు ఇచ్చేవాడు. ఆ సమయంలో మందాకిని దావూద్‌తో కలిసి ఫొటోలు దిగింది. ఆ ఫొటోలు చూపించి మందాకిని దావూద్ ఉంపుడుగత్తె అని ప్రచారం చేశారు. ఆ ప్రచారం వల్ల ఆమెకి సినిమాలలో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. సిల్క్ స్మితకి సినిమా రంగ ప్రముఖులతో అక్రమ సంబంధాలు ఉండేవని జరిగిన ప్రచారం కూడా అలాంటి మసాలా ప్రచారం అని ఎందుకు అనుకోకూడదు?

  ReplyDelete
  Replies
  1. అనుకో, నీ ఇష్టమొచ్చింది అనుకో. సినిమా 10సార్లు చూడు, అది నిర్మాతకు కావాల్సింది.

   Delete
 9. నీ లాంటి అజ్ఞాని ప్రేక్షకులు ఒక్కొక్కడూ నూట యాభై రూపాయలకి టికెట్‌లు కొని నిర్మాతలకీ, డిస్ట్రిబ్యూటర్‌లకీ కరెన్సీ నోట్ల వర్షం కురిపించడమే కదా సినిమా నిర్మాతలకి కావాలి. కనుక నువ్వే పది సార్లు చూడు.

  ReplyDelete
  Replies
  1. 10సార్లు చూట్టానికి మతిలేని మందంగిని కాను, నేను నెట్ మీద ఫ్రీగా చూస్తా.

   Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...