Sunday, September 16, 2012

కనబడుట లేదు....

అవును నువ్వు కనబడక
ఇలా గోడ మీద బొమ్మవయ్యావు....


నీ కన్న పేగు ఎన్ని పస్తులుందో!
నీ తండ్రి చేతిలో పని పడక గుండె నరం కోత పెడుతుంది....

నీ ఇంటి గుమ్మం
కన్నీరు కారుస్తూ తెరచుకున్న కంటి రెప్పయింది...

బాబూ!
నీ చిరునామా లేని నడక ఎందాక?

ఏ నిరాశ మబ్బు నిన్ను కమ్ముకొని
నిర్వేదపు సుడిగాలి నీ రెక్క పట్టుకు ఈడ్చుకు పోయిందో...

కనడని నీ రూపం
యిలా గోడపై చిత్రమై నా కలంలో కన్నీటి సిరా అయింది...

రారమ్మంటున్న
నీ ఆత్మీయుల పిలుపు నీ ఎదకి చేరాలని ఆశిస్తూ....

(
ఇలా గోడమీద కనబడుటలేదు అన్న ఫోటో చూసినప్పుడంతా మనసులో కలిగే భావం)

6 comments:

  1. ఇంటిగుమ్మాన్ని ఎదురుచూసే దుఃఖిత నయనం చేసిన మీకవిత అద్భుతం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మడిపల్లి రాజ్ కుమార్ గారూ..మీ రాక చాలా సంతోషాన్నిచ్చింది..

      Delete
  2. మనసుని కదిలించేలా ఉంది మీ కవిత

    ReplyDelete
  3. ఎక్కడ ఎలా వున్నాడో, ఆత్మీయుల పిలుపు వినపడేనా.... బాగుంది....

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...