Monday, September 17, 2012

ఓదార్పు సంతకం...


అలసినప్పుడు
గాలి తిమ్మెరలా తాకుతావు...

దాహం వేసినప్పుడు
అమృతపు చినుకువై కురుస్తావు...

ఒంటరితనం ఆక్రమించినప్పుడు
భుజంపై చేయివౌతావు....

అడుగు పడని నడకలో
జతగా పాదం కలుపుతావు....

గొంతు పెగలని పాటలో
రాగమై పల్లవిస్తావు....

వర్షించే కను రెప్పలపై
ఓదార్పు సంతకమౌతావు....

నలుపు తెలుపు కలల తెరపై
రంగునద్ది జీవం పోస్తావు....

నేస్తమా చివరి ఊపిరిదాకా
ఈ తడి ఆరనీయకు...
.

10 comments:

  1. అలా మీతో ప్రతి విషయంలో కలిసున్నప్పుడు చివరివరకూ మీతోనే ఉంటుందిలెండి వర్మగారు:)

    ReplyDelete
    Replies
    1. మీరు హామీ యిచ్చారు కాబట్టి హేపీ అండీ ప్రేరణ గారూ...థాంక్యూ...

      Delete
  2. భావం బాగా కవితలో ఒదిగింది. బాగుంది.
    అన్నీ అయ్యే నేస్తం చివరి శ్వాసలోనూ తోడైతే....చాలు కదూ!

    ReplyDelete
    Replies
    1. అవునండీ చిన్ని ఆశ గారూ అదే నా ఆశ...థాంక్యూ..

      Delete

  3. వర్షించే కను రెప్పలపై
    ఓదార్పు సంతకమౌతావు.
    beautiful lines
    నేస్తం చివరిదాకా నడుస్తే అంతకంటే అదృష్టమేముందండి..నైస్ ఫీలింగ్.

    ReplyDelete
  4. "వర్షించే కను రెప్పలపై
    ఓదార్పు సంతకమౌతావు....

    నలుపు తెలుపు కలల తెరపై
    రంగునద్ది జీవం పోస్తావు...."......... నేస్తమా చివరి ఊపిరిదాకా ఈ తడి ఆరనీయకు... ఇంత మంచి స్నేహం దొరకడం అదృష్టం... అందరికీ ఈ అదృష్టం దొరకడం మాత్రం అసాధ్యం... ఫీల్ చాలా బాగుంది వర్మగారు...

    ReplyDelete
    Replies
    1. శోభ గారూ మీ కామెంటు పొందడం నా అదృష్టమండీ...ధన్యవాదాలు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...