Thursday, September 6, 2012

మువ్వల సవ్వడి...

నీ మనసు
నీ వేలి చివర మెరుస్తోంది...

అలా తాకగానే
గుండెలో పరిమళిస్తూ....

రారమ్మని నీ పిలుపు
నీ ఊపిరి స్వరంలో వినిపిస్తోంది...

ప్రియా!
అలిగిన వేళ
నీ అరిపాదంపై నా కన్రెప్పల
స్పర్శతో చక్కిలిగిలి కానా??

రహస్యాలన్నీ పాతరేసి
మనసు ఐమూలల దాగిన
భావ ప్రకంపనలను పంచుకో చెలీ...

నీ పాపిట తాకిన
నా పెదవినంటిన సింధూరం
నీ కళ్ళలో జ్వలిస్తూ
వెచ్చని ఆవిరిలూదుతోంది....

నా గత జన్మల బాకీనంత తీర్చగ
నా గుండె లయలో ఆలాపన కావా??

రాగ రంజితమైన వేళ
వెన్నెల స్నానమాడుతూ
నీ కాలి మువ్వల సవ్వడినవుతా....

12 comments:

  1. ఇంతకీ ఎవరికోసమో ఈ అందాల అనురాగసిరులు వర్మగారు:-)

    ReplyDelete
    Replies
    1. అంతరంగంలో కొలువైన కలల యామిని కోసం పద్మ గారూ..:-)
      మీ ఆత్మీయ ప్రశ్నాత్మక స్పందనకు ధన్యవాదాలు...

      Delete
  2. అనునయంగా లాలించడంలో మీది అందెవేసిన చేయండి:)

    ReplyDelete
    Replies
    1. అనికేత్ మీ భావనాత్మీయ స్పందనకు థాంక్యూ...

      Delete
  3. Sweet! Lovely poem! Quite romantic... బాగుంది వర్మ గారు

    ReplyDelete
    Replies
    1. Oh..thank you జలతారు వెన్నెల గారూ...

      Delete
  4. అలిగిన వేళ
    నీ అరిపాదంపై నా కన్రెప్పల
    స్పర్శతో చక్కిలిగిలి కానా??...
    భావుకత్వానికి నిలువుటద్దం కదూ...
    ఈ భావం...
    బాగుంది 'వెన్నెల స్నాత' మువ్వల సవ్వడిగా మారడం..
    అభినందనలు వర్మ గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ రసాత్మీయ అభినందనలకు అభివందనాలు శ్రీ గారూ...

      Delete
  5. వర్మ గారూ, కవిత అద్భుతంగా ఉందండీ,
    ఓ అందమైన ఊహని మీ కలం తో ఇంకా అందంగా మార్చారు.
    మీ కవితల్లో ఎప్పుడూ మంచి భావుకత ఉంటుంది. చక్కటి కవి సమయం ఉంది కవితలో.
    చాలా,చాలా బాగుంది.....మెరాజ్

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ మెచ్చుకోలు నాకెప్పుడూ స్ఫూర్తిదాయకం కదండీ... అభివందనాలు మెరాజ్ గారూ...

      Delete
  6. అలిగిన వేళ
    నీ అరిపాదంపై నా కన్రెప్పల
    స్పర్శతో చక్కిలిగిలి కానా??
    మాలో చక్కిలిగింతలు పుట్టించింది మీ కవితా స్పర్శ

    ReplyDelete
    Replies
    1. ఓహ్...మీ స్పందన కూడా శేఖర్ గారూ...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...