వాడు నవ్వడు
వాడు ఏడ్వడు
వాడు కదలబారే ఓ వానపాములా కనిపించే అనకొండ....
వాడి గాజు కళ్ళ చాటున
ఓ మహా విస్ఫోటనం దాగుంది...
వాడు కోట్లాది ప్రజల
ఆకలి మంటల మూలవిరాట్టు....
వాడికొక్కటే కోరిక
ఈ గొంతులన్నిటిపై డేగ కాళ్ళను గుచ్చాలని....
వాడికొకటే ధ్యాస
ఇక్కడి అమ్మ పాలను సంతలో అమ్మేయాలని....
వాడికి వున్నదొకటే లేపన శక్తి
పడిపోయిన మార్కెట్ మాయా రేఖల పురోగమనం....
వాడి మొఖాన అంటిన బొగ్గు మసిని
అందరి జీవితాలపై మండించి ఆనందించే కౄర రక్కసి...
వాడొక నిశ్శభ్ద డ్రాక్యులా
జనం మూలుగులను నొప్పి తెలీకుండా పీల్చేసే జలగ సిరంజీ....
వాడు అమ్మ గర్భంలో దాగిన పిండాన్ని
నోట కరచుకు పోయే తోడేళ్ళ గుంపు నాయకుడు
వాడు రణస్థలం నుండి కూడంకుళం దాకా అణు విస్ఫోటణం
చేయ చూస్తున్న రాకాసి డేగ ముక్కున వేలాడే శవం....
వాడొక ప్రేతాత్మ
వాడి అంత్యక్రియలనాడే ఈ దేశానికి కళ్యాణం....
వ్యక్తుల అంతం తో వ్యవస్థ కో , దేశానికో ఆనందం రాదు. అవసరానికి మించిన ఆవేశమేమో అనిపించింది.
ReplyDeleteఎవరి మీదనో ఇంత కోపం.:-)
ReplyDeleteవర్మగారూ, " వాడి" ముందు రణభేరి మ్రోగించి, మరణ మృదంగం వాయించండి.
ReplyDeleteప్రతి ఒక్క అక్షరాన్ని ఆయుధం చేయండి. ఆ "వాడు" కచ్చితంగా కీడే అయితే ఒకే నిరసనను వంద కలాలతో రాయండి. ఆకరి సిరా చుక్కవరకూ.
ఎవడు వాడు..
ReplyDeleteఉందిగా...వొట్ హక్కు మల్లీ మల్లీ వెసి వాని ఎన్నుకొ మల్లీ మల్లీ థిట్టుకో....(మనందరం ఈ కో ..లొ ఉంటాము మల్లీ వాన్నే ఎన్నుకుందాము)...ఎవడి ఖర్మ వాడు అనుభవించాలి కదా సొ ఎన్నుకున్నందుకు ఎన్నుకున్నంథ
ReplyDeletevaadantee... maaradu... dagaaa chestoone untadu... dochukuntoone untadu... raktam taagutoonee untadu... vikruthi hela srustistoone untadu... vadantee maradu... maarket mayajalapu maantrikudatadu.... andukeee vaadu maradu
ReplyDeleteచాలా ఘాటుగా ఉందండీ నిరసన..
ReplyDeletePalla Kondalarao garu, Padmarpita garu, Meeraj Fathimaji, Surabhibalamuralikrishnagaru, Anonymous garu, Itsmine, subhagaru..ఆందరికీ ధన్యవాదాలు...
ReplyDeleteవ్యక్తుల అంతంతో మార్పు పూర్తి కాదన్నది నిజమైనా ఓ నియంత పరిపాలన అంతమయితే ఆనందం కలుగదా?? అలా అయితే ఉరిశిక్ష అనవసరమే కదా? ఆవేశంగా రాసిన మాట వాస్తవమైనా ఆగ్రహాన్ని వ్యక్తపరచలేక పోవడం కూడా దౌర్బాగ్యమే కదా?? ఎన్నెన్నో సమస్యలను మౌనంగా భరించే దుస్థితిని ఎండగడదామనే??