Saturday, September 1, 2012

నిప్పు ఊట..

నా ఆలోచనలెవరో దొంగిలిస్తున్నారు
ఒక్కొక్కటిగా....

తెరచిన కిటికీ గుండా ఓ మబ్బు తెరలా
లోలోన కురుస్తూ....

లోలోపల తడి గుండె మంటకు
ఆవిరవుతూ ఎండకాస్తూ....

రాతిరంతా ఓ మాట నిప్పు ఊటలా
భగ్గుమంటూ...

కప్పుకున్న కలల దుప్పటి
కమురు వాసనేస్తూ....

గుండెల కుంపటి మంట
కనురెప్పలను ఆరబెడుతూ....

దాచుకున్న నెమలీక ఒక్కోటీ
బూడిదౌతూ....

నాకు నేనుగా అల్లుకున్న కతల
పుటలు జ్వలిస్తూ....

ఆలోచనల కొలిమి తిత్తి ఎగదోస్తున్న
నిప్పురవ్వల చిగుళ్ళు నర్తిస్తూ....

కుంచెకంటిన రంగు చిత్రానికి
మంటనద్దుతూ....

కమ్ముకుంటున్న కారు మబ్బుల చినుకు
నిట్టూర్పుల ఆవిరౌతూ....


నా చుట్టూ చితి మంటల
ఊలలు నాదమౌతూ నన్నావహిస్తూ...

20 comments:

  1. వేదన బాగా చెప్పారు

    ReplyDelete
  2. kavitha bhaavana baagundi varmagaru.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫాతిమా గారూ..

      Delete
  3. టైటిల్ లోనే సగం వేదన కనపడుతుంది, మిగిలింది మీదైన శైలిలో భావాన్ని వ్యక్తపరిచారు.

    ReplyDelete
    Replies
    1. అవునా...థాంక్సండీ పద్మార్పిత గారూ...

      Delete
  4. నాకు నేనుగా అల్లుకున్న కతల
    పుటలు జ్వలిస్తూ....
    కుంచెకంటిన రంగు చిత్రానికి
    మంటనద్దుతూ....
    ...
    చాలా బాగుంది వర్మ గారూ!
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు శ్రీ గారూ..

      Delete
  5. ఇంత వేదన అవసరమాండి:) ఒక హాస్య కవిత మీ కలం నుండి జాలువారితే చదవాలని వర్మగారు.

    ReplyDelete
    Replies
    1. అవసరమా అంటే ఏం చెప్పను...:(
      హాస్య కవిత రాసే చతురత నాకు లేదండీ ప్రేరణ గారూ...
      మీ స్ఫూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలు...

      Delete
  6. వేదనను కూడా ఇన్ని విధాలుగా చెప్పొచ్చన్నమాట. చాలా బాగుందండి.

    ReplyDelete
  7. మీ ఆలోచనల్ని దొంగిలించేంత ధైర్యమాండి:)
    ఎవరైనా మీ అనురాగానికై దేహీ అంటారేకానీ!

    ReplyDelete
    Replies
    1. అనురాగాన్ని దేహీ అనరు అనికేత్..
      దొంగిలిస్తేనే తీయదనం కదా..:)
      Thanks a lot..

      Delete
  8. మిమ్మల్నావహించిన చితి మంటలు ఓ అమృతపు జల్లుతో ఆరిపోవాలని ఆశిస్తూ...

    ReplyDelete
    Replies
    1. నాకు నచ్చిందండి ఈ కమెంట్:-)

      Delete
    2. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ వడ్రంగిపిట్ట గారూ...

      Delete
  9. ఆలోచనల కొలిమి తిత్తి ఎగదోస్తున్న
    నిప్పురవ్వల చిగుళ్ళు నర్తిస్తూ....
    గొప్ప ప్రయోగం.కవితలోని వేదన అర్థమవుతుంది మెల్ల మెల్లగా .

    ReplyDelete
    Replies
    1. మీ అభినందన పొందడం ఆనందంగ వుంది రవిశేఖర్ గారూ..ధన్యవాదాలు...

      Delete
  10. వెన్నెల కూడా దహించడం అంటే ఇదే కాబోలండీ..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...