Saturday, October 6, 2012

ఏమవుతావో!!


నాకేమవుతావో నువ్వని
చిలిపిగా అడిగితే ఏమని బదులీయను...

నాలో సగమైనావని
నా ఊపిరిలో భాగమైనావని
నా కనులలో కాపురమున్నావని
నా ఎదలో కొలువైనావని
నా మనసునిండా నువ్వే వున్నావని చెప్పనా?

నీ ఎడబాటు భరించలేనంత బేలగా మారానన్నది
నీ గుండెకు తెలియదా చెలీ...

మన పరిచయం చిగురించిన నాటి నుండి
ఓయ్ అన్న నీ పిలుపు గుండెలో అల్లరి చేస్తుంది...

ప్రియతమా!
నీ ఊసుల ఊహల ఊయలలూగు ప్రతి క్షణం నాకు పరవశమే...

28 comments:

  1. చిలిపిగా అడిగిన తన ప్రశ్నకి
    మనసుని తాకి మైమరిచే జవాబునిచ్చారుగా:-)
    అందుకోండి.....అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ అభినందనలకు ధన్యవాదాలండీ పద్మార్పిత గారు...

      Delete
  2. @వర్మ గారు చాల బావుంది ,బాగా వ్రాసారు ,పదాలన్ని సరయిన వ్యక్తీ చేతిలో బందీలు అయ్యాయి !

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ స్ఫూర్తిదాయక స్పందనకు maromahaprasthanam gaaru..

      Delete
  3. మీ రాతల్లో పదాలు చక్కగా ఒదిగిపోతాయి.

    ReplyDelete
  4. ఏదిరాసినా మంచి ఫీల్ తో రాస్తారు వర్మగారు.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ సృజన గారు...

      Delete
  5. varmaaji, mownam tarvaatha emavthundo chakkani bhaavantho cheppaaru.

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ ఫాతిమా గారు...

      Delete
  6. మీ భావాలమాలని మా ముందుంచారుగా:)

    ReplyDelete
  7. వావ్! చాలా బాగుందండీ!

    ReplyDelete
  8. వర్మ గారు.. అద్భుతంగా రాసారండీ!

    ReplyDelete
  9. వర్మాజీ,మంద్ర సంగీత భావ విభావరి మీ యీ బ్లాగు. బాగుంది. ..నూతక్కి.

    ReplyDelete
  10. ధన్యవాదాలు గురూజీ...

    ReplyDelete
  11. wow...amazing!!!!chala chala bagundi varma gaaru :)

    ReplyDelete
  12. ఓయ్...ఏయ్ లోని దగ్గరితనం ఎడదకు మాత్రమే వినిపించే అక్షరగుణం...అందంగా గుసగుసలాడేటి తెంపరితనం...అరుదుగా స్వరించేటి సాన్నిహిత్య గానం...అందంగా అక్షరాలతో మీటారు కదా ఎద సడిని కవి వర్మాజీ....శిరసాః నమామి...

    ReplyDelete
  13. మీ ఆత్మీయ స్పందనకు నమస్సుమాంజలులు పద్మా శ్రీరాం గారు...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...