Monday, October 15, 2012

అంటు....


నువ్వు ముక్కలుగా నరికి పారేసాననుకున్నావు
కానీ అంటుకట్టే మా చేతుల్లో మళ్ళీ మళ్ళీ ప్రాణం పోసుకుంటునే వుంది...

ఒక్కో గాయానికి వరుసగా పసరు మందేదో
కట్టు కట్టినట్టు తెగిన చోటల్లా చిగురు వేస్తూనే వుంది...

గొంతును చీలుస్తూ దిగబడ్డ చోట
మరల పాట కడుతూనే వున్నాం....

నువ్వు విరిచి పారేసాననుకున్న పాదాలన్నీ
నేడు కదంతొక్కుతూ దండయాత్రకై కదలబారుతున్నాయి....

(లక్ష్మీపేట బాధిత దళితులతో కలసి నడచిన వేళ...)

4 comments:

  1. ఒక్కో గాయానికి వరుసగా పసరు మందేదో
    కట్టు కట్టినట్టు తెగిన చోటల్లా చిగురు వేస్తూనే వుంది...uttejamaina mee bhaavaavesam venuka aavedana kanipisthundi varmaajee.

    ReplyDelete
  2. ధన్యవాదాలు ఫాతిమాజీ మీ స్ఫూర్తిదాయక స్పందనకు..

    ReplyDelete
  3. ఒక్కో గాయానికి వరుసగా పసరు మందేదో
    కట్టు కట్టినట్టు తెగిన చోటల్లా చిగురు వేస్తూనే వుంది...

    శేషేంద్రుని నుండి ఇస్మాయిల్ వరకూ నిలిపింది ఈ ఆశలచిగురే
    భల్లం నుండి సతీష్ వరకూ తడిమింది ఈ చిగురుకేకే..

    మీ కవనం లో ఇదో వెలుగురేక.. ఎప్పటికీ మననం చేసుకునే కవితాపతాక. ఇక నావద్ద మాటల్లేవ్.

    ReplyDelete
  4. mee visleshanaatmaka sphurthidayaka spandanaku dhanyavaadaalu sky gaaru...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...