Saturday, October 27, 2012

పెలుసుతనం...

దుఃఖం

కనుగుడ్డు పగిలిపోయేట్టు రోదిస్తున్నా
తీరని ధుఃఖ హృదయం...

దేహమంతా అలముకున్న
కమురు చాయలు...

రేయంత చీకటి కమ్ముకున్న
హృదయాకాశం...

ఒక్కసారిగా తెరచాప చినిగి
నడి సంద్రంలో నిట్ట నిలువునా కూలిపోయినట్టు...

రాకడ లేని గుమ్మం
వెల వెలబోయిన పసుపుతనంతో....

చిగురు వేయని మొక్క
ఎండి బీటలు వారిన నేల...

చినుకు పడని మేఘం
ఆవిర్లుగా సుళ్ళు తిరుగుతూ....

జబ్బ సత్తువ కొద్దీ విసిరినా
వొట్టి బోయిన వలలా....

గదినిండా నిట్టూర్పుల
జ్వర పీడనం...

ఈ ఖాళీతనం గుల్లతనం
పెళుసు బారుతూ రాలిపోతూ...

12 comments:

  1. బాగుందండి వర్మగారు మీదైన శైలిలో...అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. థాంక్సందీ పద్మార్పిత గారు..

      Delete
  2. వర్మ గారూ, మీ శైలి బాగుంది,
    ఈ కవితలో మొదటి రెండు లైన్లు చదువుతూనే తెలుస్తుంది ఎదో వేదనా భరితమైన కవిత అని.
    బాగుంది సర్ .

    ReplyDelete
  3. Pic itself is indicating that its an emotional loneliness feeling and for that your poetry added the fragrance to it.

    ReplyDelete
  4. నిర్మొహమాటం గా చెప్పాలి అంటె ..గుండె గది లొపల సుళ్ళు తిరెగె వే్దన ని హగ్ చెసుకొన్నట్లుగా ఉందంది ...

    ReplyDelete
  5. ఆర్ద్రతతో కూడిన అందమైన పదజాలం మీ ఈ ఒంటరితనం.

    ReplyDelete
  6. ్సృజన గారు ధన్యవాదాలండీ

    ReplyDelete
  7. "ఈ ఖాళీతనం గుల్లతనం
    పెళుసు బారుతూ రాలిపోతూ..."...... ఒంటరితనాన్ని చాలా హృద్యంగా ఆవిష్కరించారు. చాలామంది ఒంటరితనం అంటే ఇష్టపడుతుంటారు.. నాకైతే నరకంలా అనిపిస్తుంది ఒంటరితనం తల్చుకుంటేనే..

    ReplyDelete
    Replies
    1. నిజమే శొభరాజ్ మేడం.. ఒంటరితనం భరింపరానిదే..
      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...