Tuesday, October 23, 2012

ముద్రలు..

అలా ఇసుక తడి లోతులో
నీ పాద ముద్రలు...

గుండె అరలో మిగిలిన
నీ జ్ఞాపకాల ముద్రికలు...

అలల కోతకు చెరగని
తీపి గురుతులు...

యింకా పరిమళిస్తూనే వున్న
నీ జడ సాంబ్రాణి ధూపం...

రిబ్బను చివర వేలాడుతున్న
మందార పుష్పం...

నీ చుట్టూ ఓ వెలుగు
మంత్రపు వలయం....


నేనిలా

ఒంటరిగా యిలా యిసుక
రేణువులను ముద్దాడుతూ....

8 comments:

 1. Replies
  1. థాంక్సండీ పద్మార్పిత గారు...

   Delete
 2. అసాంతం మంచి ఫీల్ తో రాసారండి.

  ReplyDelete
 3. వర్మగారూ, గుండె అరలో, మనసు పొరలో దాగిన ఫీలింగ్ అలల కోతకు గురికాని భావన .
  అక్షరాలో ఒదిగిపోయింది...చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. మీ మాట స్ఫూర్తిదాయకం ఫాతిమాజీ..థాంక్యూ...

   Delete
 4. ఈ "ముద్రలు" సున్నితంగా ఉన్నాయండి మీ కవితల్లాగే:-)

  ReplyDelete
  Replies
  1. సున్నిత మనస్కులైన మీ స్పందనకు ధన్యవాదాలు తెలుగమ్మాయి గారు...

   Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...