Thursday, October 18, 2012

నిర్జన వంతెన....

ఈ నిర్జన వంతెన అంచున
ఒక్కో దారప్పోగునూ పేనుతూ
అక్షరాల అల్లికలల్లుతూ
పదాల మధ్య బందపు కండెను జార్చుతూ
ఒలికి పోకుండా పట్టుకొనే ఒడుపు కోసం నిలబడి వున్నా....

ఏదీ అంటనితనమేదో యిలా ఒంటరిగా
మిగిల్చి పాదాలను రాతి తాళ్ళతో బంధించి
దేహాన్ని ఇలా వదిలేసి పోయింది....

మనసు మూగతనాన్ని నింపుకొని
గ్లాసు నిండుగా ఒంపినా గొంతుదిగని మత్తు....

యుద్ధానంతర నిశ్శబ్ధపు నీరవం
చుట్టూరా పొగల సుళ్ళుగా  అల్లుకొని
అస్తమయ వెలుగులో కాసింత రంగునిచ్చి
కనులలోయలో ఒరిగిపోతు....

దూరంగా జరుగుతున్న మేఘాల రాపిడికి
అక్కడక్కడా మెరుస్తూ ఓ వాన చినుకు
కన్రెప్పపై జారిపడి వెచ్చగా గొంతులో దిగుతూ
గుండె మూలల ఖాళీని కాసింత కప్పే కఫనవుతూ....

దేనికదే ఒక అసంపూర్ణత్వం కలగలిసి
నలుపు తెలుపుల చిత్రంగా గోడనతుక్కొని
కలవని గీతల వలయంలా మారుతూ
వెక్కిరిస్తూ ఎదురుగా అలా నిలబడుతూ....

ఎక్కడో ఓ సన్నని నాదం విరిగిన వెదురు పొద మీంచి
గాలిని కోస్తూ శబ్ధావరణాన్ని సృష్టిస్తూన్న
వాతావరణంలో గాయాన్ని సలపరమెట్టిస్తూ.....

16 comments:

  1. దేనికదే ఒక అసంపూర్ణత్వం కలగలిసి
    నలుపు తెలుపుల చిత్రంగా గోడనతుక్కొని
    కలవని గీతల వలయంలా మారుతూ
    వెక్కిరిస్తూ ఎదురుగా అలా నిలబడుతూ....
    అసలు చేరాలనుకున్న దారి ఎప్పుడు కలుస్తుందో తెలీని నిరాశ.
    స్తబ్దమైన భావన కనిపించింది మీ కవితలో నేను సరిగా చెప్పానో లోదో తెలీదు.
    వర్మగారూ కవిత ఇంకా విపులంగా రాసి ఉండవచ్చు మీరు. బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నా మనసు పలికే భావాలను యిలా పంచుకునే ప్రయత్నమండీ...అది అసంపూర్ణమో, సంపూర్ణమో నాకెరుకలో వుండదు...మీ విశ్లేషణాత్మక ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ...

      Delete
    2. varmaaaji nadi vimarsha kadu inkaa vivaramgaa raayagalaru meru annaanu.

      Delete
    3. mee spandananu vimarshaga analedu Fathimaji..visleshana annaa..appatikappudu palikinadi rayadame..inkaa baagaa antu yenadu prayatnichaledu..alaa raavadamledu chitrika patti raayadam..:(

      Delete
  2. వర్మ గారు as usual మీ పద సంపదను బాగా ప్రదర్శించారు ! నిప్పు కణిక ల్లాంటి పదాలు !

    ReplyDelete
    Replies
    1. ప్రదర్శన ఏం లేదండీ...just put my feel on wall...ఎందుకంటే నేనంత పద సంపద్వంతుడిని కాదు...గమనించే వుంటారు...ధన్యవాదాలు maromahaprasthanam garu..

      Delete
  3. మీతో సర్వకాల సర్వవ్యస్థలయందు ఆమె తోడని చెప్పే మీకు ఒంటరితనమేల వర్మగారు:)
    కవితా పరంగా భావాలు బాగున్నా ఇలా ఒంటరితనాన్ని కావాలని కోరితెచ్చుకోకండి:)

    ReplyDelete
    Replies
    1. అప్పుడప్పుడూ ఒంటరితనంలోని వేదననుభవిస్తేనే ఆమె గొప్పదనమెరుకవుతుందని యిలా..:)
      మీ అనురాగ స్పందనకు ధన్యవాదాలు అనికేత్..please take my Perk..

      Delete
  4. నిర్జన వంతెన పై వితౌట్ సౌండ్ పొలూషన్ మీరొక్కరే ఎంజాయ్ చేస్తానంటే మేముఒప్పుకోమండి వర్మగారు:-) మేమంతాలేమా!!

    ReplyDelete
    Replies
    1. వావ్...
      యింక మీరు ఈ వంతెన వద్దకొస్తానంటే ఒంటరితనమేముంటుంది...
      కవితా గానమే కదా పద్మ గారు..:-)

      మీ సాహితాత్మీయ స్పందనకు ధన్యవాదాలు..

      Delete
  5. Replies
    1. ధన్యవాదాలు రమెష్ గారు...

      Delete
  6. జనంతో కలిసి నడిచే మీకూ ఒంటరితనమేంటండీ వర్మగారూ..
    ఏదో నిగూఢమైనది మిమ్మల్ని శాశిస్తున్నట్టుంది..
    Enjoy the silence of loneliness sometimes is better to know what we are..Congrats...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వడ్రంగిపిట్ట గారు మీ ఆత్మీయ సూచనకు...

      Delete
  7. చూస్తుంటాను మీ వ్రాతలన్నీ... చదివినప్పుడంతా కొత్తదనమే

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ లిపి భావన గారూ...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...