Wednesday, October 17, 2012

అభినందన ముద్ర...


 
రేయంతా నీ ధ్యాసలో గడిపి
గుండె ఊసులన్నీ నీ మదిలో వేసి
నీ పెదవి మౌనాన్ని ఓ అభినందన ముద్రతో మేల్కొలిపి
నా ఆశ తీరగా నిను అల్లుకొని
నీ మెడవంపున చిగురించిన
కోరిక నరాన్ని పంటితో పట్టి చక్కిలిగిలి పెట్టి
వలపునంతా వడపోస్తూ
స్వరరాగమెట్టు ఎక్కుతూ దిగుతూ
అల్లరి వల్లరి పల్లవిగా నీ గొంతులో పలుక చేరరాగా


పో
రా,,, 
అంటూనే
గుండెలో ఒదిగిపోయిన
నీ పాపిట చుంబన సింధూరమై
మధుర ఉదయ గీతికనాలపించనా.....

10 comments:


  1. స్వరరాగమెట్టు ఎక్కుతూ దిగుతూ
    అల్లరి వల్లరి పల్లవిగా నీ గొంతులో పలుక చేరరాగా..

    వేల సరసాల సురసాల యేలు దొరా ..రసికరాజ జయహో.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు సతీష్ (SKY) గారు..

      Delete
  2. varmaajee, kavithalo bhaavukatha chakkani padaalatho chepparu

    ReplyDelete
  3. చక్కని పదాలతో చిక్కని భావాన్ని చెప్పారండి.

    ReplyDelete
  4. ఇలా హాయిగా గడిపేయక ఎందుకండి మీకు ఒంటరితనం:)

    ReplyDelete
    Replies
    1. ఓ...మీ మాట శిరోధార్యమండీ అనికేత్ గారు...:-) Thank you.

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...