Tuesday, October 30, 2012

సముద్రానికెదురుగా...


సముద్రానికెదురుగా నేను
నాకెదురుగా తను...

ఒక్కో అలా ఎగసిపడుతూ
తీరం దాటనితనంతో మరలుతూ...

మౌన ఘోష చుట్టూ ఆవరించుకున్న
తరగని ఇసుక తీరం...

లోలోతుల ఇంకని ఆశల నురుగు
అలల అంచుల తాకుతూ...

కదలుతూనే వున్నట్టున్న
జడభరితం...

తుఫానులెన్నొచ్చినా
తన పరిథి దాటనితనం...

ఆకాశన్నంటుతున్నా
అందని జాబిలి...

నాకెదురుగా తను
సముద్రానికెదురుగా నేను...

24 comments:

 1. Replies
  1. ధన్యవాదాలు మంజు (చెప్పాలంటే...) గారు...

   Delete
 2. Chaala bagundhi varma gaaru....naaku ippudu konchem jealousy ga kooda undhi :)

  ReplyDelete
  Replies
  1. థాంక్యూ Kaavya anjali గారు...జెలసీ ఎందుకో..:-)

   Delete
  2. మీలా కవితలు రాసే టాలెంట్ దేవుడు నాకు ఇవ్వలేదు అందుకు :(

   Delete
  3. నేనేమంత టాలెంటెడ్ కవిని కాదులెండి..కవిత్వాన్ని ఆస్వాదించి అభినందించే గొప్ప మనసుంది కదా మీకు..అదే పెద్ద వరం Kaavya anjali garu...:-)

   Delete
 3. మొన్న పొద్దునే విశాఖ లో రామకృష్ణ బీచ్ లో సముద్రపుటొడ్డున పొర్ణమినాడు ,ఉవ్వెత్తున్న ఎగిసిపడే అలలు సౌందర్యం చూస్తూ సముద్రానికెదురుగా నేను,చూపు తిప్పకుండా కళ్ళ నిండా నింపుకొని,నన్నే చూస్తూ మావారుఅంటే,ఒకింత ఆశ్చర్యంగా ఎప్పుడుచూసిన నీకు కొత్తే కదా అంటూ..

  చాలాబావుంది కవిత వర్మగారు.
  ఒకవిధంగా గ మీ ఈ అనుభూతిని నేను సొంతం చేసుకొన్నాను

  ReplyDelete
  Replies
  1. మీ అనుభూతిని పంచుకున్నందుకు ధన్యవాదాలు పూర్వ ఫల్గుణి గారు...

   Delete
 4. సముద్రానికి అటువైపునున్నా....
  మీకు అందనంత దూరానున్నా...
  మీ మదిలో ఉందికదండి:-)

  ReplyDelete
  Replies
  1. మదిలో వున్న ఆమని కోసం ఎదురు చూపులే కదండీ పద్మార్పిత గారూ..మీ ఆత్మీయానురాగ స్పందనకు ధన్యవాదాలు...

   Delete
 5. మనసుని ఆకట్టుకుంది మీ కవిత వర్మ గారు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు జలతారువెన్నెల గారు..
   బహుకాల దర్శనం...మీ పునర్దర్శనం ఆనందదాయకం..:-)

   Delete
 6. లోలోతుల ఇంకని ఆశల నురుగు
  అలల అంచుల తాకుతూ...
  కదలుతూనే వున్నట్టున్న
  జడభరితం...
  విన్నూతన పదజాలం.

  ReplyDelete
  Replies
  1. యిలా ప్రేరణాత్మక వ్యాఖ్యానంతో ప్రోత్సహిస్తూ ఊపిరిలూదినందుకు ధన్యవాదాలు ప్రేరణ గారు..

   Delete
 7. చక్కని శైలితో భావాలని కొంగ్రొత్తగా పండించడం మీకు వెన్నతో పెట్టిన విద్య.

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానానికి ధన్యవాదాలండీ సృజన గారు..మీ మాట సృజనదాయకం నాకెప్పుడూ...

   Delete
 8. ఇలా ఒకరికొకరంటూ అటొకరు ఇటొకరూ.....ఏంటోమరి:-)  ReplyDelete
  Replies
  1. ఆ దూరాన్నికలిపే వారథి కవిత్వమే కదండీ తెలుగమ్మాయి గారూ...:-)
   థాంక్సండీ...

   Delete
 9. తుఫానులెన్నొచ్చినా
  తన పరిథి దాటనితనం... ee bhaavam mee sailini inkaa merugu parachindi, varmagaru.
  mee prati kavitalo o kotta bhaavam untundi. chaalaa baga raasaaru.

  ReplyDelete
  Replies
  1. Mee abhimaanapoorvaka spandanaku dhanyavaadalandi Fathimaaji..

   Delete
 10. ఏంటోనండి అభినవ శోభనబాబులా....ఇంతమంది ఆడవాళ్ళ అభిమానాన్ని పొందారు (అందరూ ఆడవాళ్ళే వ్యాఖ్యలిడారు ఇప్పటివరకు:-)

  ReplyDelete
  Replies
  1. ఒహ్ అనికేత్...
   ఇది ప్రశంశా...కుళ్ళునా...
   శోభన్ బాబు నా ఫేవరేట్ కథానాయకుడులెండి...
   Any how thanks a lot for your loving one..

   Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...