నిదుర రాని నీ కనురెప్పల వాకిట
కలల తేరులో వేచి చూస్తున్నా...
మనసున నిండిన నీ రూపం
హృదయాకాశంలో వెన్నెల పరువం...
తాకని నీ వేలి చివరి జ్వాల
గుండె అంచుల రాగదీపం....
దారం కూర్చని సన్నజాజులు
నీ మెడ వంపులో ముత్యాల హారం....
దేహమంతా ఎగసిపడే అగ్నిపర్వత
సానువులా నీముందు....
హిమాలయమంత నిబ్బరంగా
నిశ్చలంగా నీవు....
కదలని ఈ శిల్పతనం
కరగిపోదా నీ చిరునవ్వు కానుకగా...
కలల తేరులో వేచి చూస్తున్నా...
మనసున నిండిన నీ రూపం
హృదయాకాశంలో వెన్నెల పరువం...
తాకని నీ వేలి చివరి జ్వాల
గుండె అంచుల రాగదీపం....
దారం కూర్చని సన్నజాజులు
నీ మెడ వంపులో ముత్యాల హారం....
దేహమంతా ఎగసిపడే అగ్నిపర్వత
సానువులా నీముందు....
హిమాలయమంత నిబ్బరంగా
నిశ్చలంగా నీవు....
కదలని ఈ శిల్పతనం
కరగిపోదా నీ చిరునవ్వు కానుకగా...
Varma gaaru.. mee daggara sishyarikam cheyaalani undandi. Ee kavitha entha baagaa raasaaro chebudaamante maatalu vethukkovaalsi vasthondi. Fantastic ani chebudaamanukunnaa. Kani maree chinna maatemo anipisthondi! Inkaa nenu maatala vetalone unnaanandee..
ReplyDeletePriya గారు మీ ఆత్మీయ అభిమాన స్ఫూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలండీ...
Delete
ReplyDeleteచాల చాల బావుంది వర్మగారూ
ఈ కవిత చదువుతుంటే రాజమండ్రిలో లో మా ముగ్గరు స్నేహితురాళ్ళం ,గోదారిఒడ్డున కూర్చొనితిలక్, చలం,కృష్ణశాస్త్రి,ఆత్రేయ, బాలచందర్,బాలు మహేంద్ర,ఇంకా ఎన్నో,ఎన్నెన్నో మా మాటలు ప్రతి దానికి స్పందించడము
ఇవన్ని గుర్తుకొచ్చాయి
ఎవరో అన్నట్లు హృదయాన్ని కదిలించేదే కవిత
పూర్వ ఫల్గుణి గారు మీ జ్నాపకాలను పంచుకుంటూ కవిత్వం పట్ల ఆత్మీయంగా స్పందించినందుకు ధన్యవాదాలండీ...
Deletechala adbhutham ga undi sir mee kavitha
ReplyDeleteదేహమంతా ఎగసిపడే అగ్నిపర్వత
సానువులా నీముందు....
హిమాలయమంత నిబ్బరంగా
నిశ్చలంగా నీవు....
కదలని ఈ శిల్పతనం
కరగిపోదా నీ చిరునవ్వు కానుకగా... especially these lines.
Many many thanks skvramesh garu...
Deleteవర్మగారు చాల అద్బుతమైన కవిత పదిసార్లు పైగానే చదివాను చదివిన ప్రతిసారి మరింత ఆనందాన్నిస్తోంది hatsoff to you sir
ReplyDeleteమీ అభిమానానికి ధన్యవాదాలు వీణ గారు...
Delete. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
ReplyDeleteప్రతిచుక్కలోను ప్రశంసాపదం దాగి ఉందని కవివర్మగారికి చెప్పక్కర్లేదనుకుంటాను:-)
మీ ఆత్మీయతను చుక్కల్లో పొదిగి చూపినందుకు ధన్యవాదాలు పద్మార్పిత గారు...
Deleteవర్మగారూ, "దేహమంతా ఎగిసిపడే అగ్నిపర్వత పానువులా నీ ముందు "
ReplyDeleteచక్కటిభావన.. కానీ హిమాలయం ముందు ఇటుక రాయి ఎంతా??.
ప్రేమ భావనను ప్రేమికను హిమాలయమంత ఉన్నతంగా పోల్చిన మీ భావుకత గొప్పది.
శిల్పతనం కరిగిపోవాలి...ప్రేమ ముందు. కవిత బాగుంది సర్.
కవితంతరంగాన్ని విశ్లేషిస్తూ స్పందించినందుకు ధన్యవాదాలు ఫాతిమాజీ...
ReplyDelete