Thursday, October 25, 2012

సడి...

 రాతిరి పూసుకున్న నలుపుతనంలో
నీ కనుల వెలుగు రేఖ...

ఒకింత గుండె సడిని
తరుముతూ కన్నార్పనీయలేదు... 

నీలాటి రేవులో మునిగిన పాదాలను
ముద్దాడిన చేప పిల్ల...

నీటిలో ప్రతిబింబమైన వెన్నెల
నీ మోముపై...

గల గల మాటాడుతూ
నువ్వు వదలిన ఊసుల పడవ...


నీ కనురెప్ప తెరచాపతో
సాగిన ఊహల పయనం...
 

అలల అంచున వీచిన గాలి
చల్లదనం తాకుతూ...

నీ వేలి చివర వెలిగిన
జ్వాల నన్నంటుతూ...

సగం కమ్మిన మబ్బు చాటుకు
చేరిన జాబిలి...

8 comments:

  1. beautiful words, beautiful expression varma ji :-)

    ReplyDelete
  2. సగం కమ్మిన మబ్బు చాటుకు
    చేరిన జాబిలి...అలికిడి వినిపించింది .................బాగుంది మాస్టర్

    ReplyDelete
  3. మీ పదాల అల్లికలో కవిత కమనీయం, దానికోసమే చిత్రం అన్నట్లుగా ఉన్నాయండి రెండూ.

    ReplyDelete
    Replies
    1. రెండూ నచ్చి మెచ్చినందుకు, మీ ఆత్మీయ అభిమానానికి ధన్యవాదాలు పద్మార్పిత గారు...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...