ఒక్కోసారి ఎక్కడికక్కడ సమ్మెతనం
సమ్మెటలా గుండెపై బరువుగా....
దగ్గరయినది దూరంగా నెట్టేస్తున్నట్టు
సుడిగాలేదో చుట్ట చుట్టుకుపోయి పారబోసినట్టు....
నేలనానిన పాదాలు ఎక్కడివక్కడే
ఊబిలో కూరుకు పోతున్నట్టు కదలనితనం....
రాతిరేదో దిగాలుగా కమ్ముకొని
ఇన్ని నిప్పు ఉసుళ్ళు నెత్తిన కుమ్మరించినట్టు....
పగలంతా ఓ పక్కకు ఒరిగిపోయిన
ద్వీపంలా మునగీ మునిగనట్టు ఊపిరిసలపనితనం....
ఆకు చివురును వేలాడిన
సాలీడు తీగనంటుకున్న కీటకంలా త్రిశంకు స్వర్గంలో....
గాలి ఆడనితనంతో దేహమంతా
చెమట కమ్ముకొని కొలిమి తిత్తి చివురులా...
నీ రాక కోసం ఈ ఎడారినంటిన ఎదలో
ఓ మాట చినుకరింపు కోసం....
సమ్మెటలా గుండెపై బరువుగా....
దగ్గరయినది దూరంగా నెట్టేస్తున్నట్టు
సుడిగాలేదో చుట్ట చుట్టుకుపోయి పారబోసినట్టు....
నేలనానిన పాదాలు ఎక్కడివక్కడే
ఊబిలో కూరుకు పోతున్నట్టు కదలనితనం....
రాతిరేదో దిగాలుగా కమ్ముకొని
ఇన్ని నిప్పు ఉసుళ్ళు నెత్తిన కుమ్మరించినట్టు....
పగలంతా ఓ పక్కకు ఒరిగిపోయిన
ద్వీపంలా మునగీ మునిగనట్టు ఊపిరిసలపనితనం....
ఆకు చివురును వేలాడిన
సాలీడు తీగనంటుకున్న కీటకంలా త్రిశంకు స్వర్గంలో....
గాలి ఆడనితనంతో దేహమంతా
చెమట కమ్ముకొని కొలిమి తిత్తి చివురులా...
నీ రాక కోసం ఈ ఎడారినంటిన ఎదలో
ఓ మాట చినుకరింపు కోసం....
సమ్మెటపోట్ల "సమ్మెతనం" లో
ReplyDeleteఎదను ఎండమావిగా చేసి
నిరాశా నిస్ఫ్రుహలకు లోనై
మీ అస్తిత్వాన్ని కోల్పోకండి:-)
మీ ఆత్మీయ సూచనకు ధన్యవాదాలు తెలుపుతూ
Deleteఅస్తిత్వాన్ని కోల్పోకుండా రెండు హృదయాలే కాదు నదీ నదాలు కూడా సంగమించ లేవు కదా పద్మార్పిత గారు...:-)
రాతిరేదో దిగాలుగా కమ్ముకొని
ReplyDeleteఇన్ని నిప్పు ఉసుళ్ళు నెత్తిన కుమ్మరించినట్టు....
మహాద్భుతంగా ఉంది ఈభావం.
మీ నుండి ఇంత మంచి మాట పొందడం ఆనందంగా వుంది అనికేత్...
Deleteథాంక్స్ ఎ లాట్..
వర్మ గారూ, ప్రతి అక్షరానా ఓ విదమైన నిశ్శబ్ద గీతం పలుకుతుంది.
ReplyDeleteవిరహమూ, వేదనా సమపాళ్ళలో తీసుకొని కవితకు అందాన్ని తెచ్చారు.
"నేలనానిన పాదాలు ఎక్కడివక్కడే
ఊబిలో కూరుకు పోతున్నట్టు కదలనితనం...." చాలా గొప్ప భావం.
మీ వివరణాత్మక స్ఫూర్తినిచ్చే ఆత్మీయ స్పందనకు అభివందనాలు ఫాతిమాజీ...
Delete"రాతిరేదో దిగాలుగా కమ్ముకొని
ReplyDeleteఇన్ని నిప్పు ఉసుళ్ళు నెత్తిన కుమ్మరించినట్టు...."
ఇది నాకు ఎక్కువగా అనుభవమయ్యే సమ్మె(ట)తనం...
hm....విషాదమైనా విజ్ఞానమైనా మీ అక్షరాల్లో భలే పురుడుపోసుకుంటుంది సర్....అందుకే మీరు కవిత్వానికే వర్మయ్యారు(రారాజు)
మీ అనుభూతిని పంచుకుంటూ ఆత్మీయ స్పందనతో స్ఫూర్తినందించినందుకు ధన్యవాదాలు Padma Sreeram గారు...
DeleteI too agree with Padma Sreeramgaru.
Deleteమీ కవితలో ఆలోచనలన్నీ అందంగా ఇమిడాయండి.
ReplyDeleteమీ అభిమానానికి ధన్యవాదాలండీ Yohanth గారు..
Deleteఒక్కోసారి జీవితంలో ఇలాంటి భావాలన్నీ అనుభవం లోకి వస్తుంటాయి.వాటిని మీ కవితలో అల్లిన తీరు అద్భుతం.
ReplyDeleteధన్యవాదాలు రవిశేఖర్ గారు
ReplyDelete