ఆకునలా తేనె ముత్యంలా వేలాడే నీటి బొట్టు
పలవరింతల ఖాళీల మధ్య ఏదో నిశ్శబ్దంగా
వెదురు పూల శోభ నేల రాలుతూ
ఓ పక్షి హఠాత్తుగా రెక్కల టప టపల మధ్య విరిగిపడుతూ
దోసిలిలో ఠప్ మని నెత్తుటి బొట్టు
నేల పాయల మధ్య మౌనంగా ఏటి నురుగు
సుదూరాన లయగా ఓ తుడుం మోత
గాయపడ్డ వెన్నెల సవరన్న గూటిలో నూనె దీపంలా
వే
లా
డు
తూ
ఏంటో ప్రతి కవితలో గాయాలు :-)
ReplyDeleteగాయపడితేనే కదా వేణువయ్యేది సాంధ్య శ్రీ గారు.. ధన్యవాదాలు..
ReplyDeleteపలవరింతల ఖాళీల మధ్య ఏదో నిశ్శబ్దంగా
ReplyDeleteవెదురు పూల శోభ నేల రాలుతూ...
ఇలా రాసే మనసుకి చేరువౌతారు.
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు..
Deleteబాగుంది సార్
ReplyDeleteథాంక్యూ అనికేత్...
ReplyDeleteవెన్నెల దారిలో గాయపడ్డ వెన్నెల బావుంది
ReplyDelete