నీ కోసం నిరీక్షించే క్షణాలు
మిగిలి వుండడం నిన్ను బతికిస్తుంటాయి
అప్పుడప్పుడూ తడి అంటిన పాదాలు
ఇసుకలో కూరుకు పోతున్నా ఇగిరిపోనివ్వవు
వాన వెలిసాక నిర్మలమైన ఆకాశాన్ని
ఈదే పక్షిలా నీ రెక్కల బలం తొడుక్కుంటావు
ఆ క్షణం వీచే గాలి మట్టి వాసనద్దుకుని
సంజీవినిలా నిన్ను తాకుతుంది
ఒడిసిపట్టిన ఆ కాలానికి రంగులద్దకుండా
ఓ వర్ణ చిత్రాన్ని గీసే ప్రయత్నం చేస్తున్నా...
మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఆశావాదం కవిత బాగుందండి.
ReplyDeleteమీ ఆశీర్వచనంతో... థాంక్యూ తెలుగమ్మాయి గారు..
Deleteఆ క్షణం వీచే గాలి మట్టి వాసనద్దుకుని
ReplyDeleteసంజీవినిలా నిన్ను తాకుతుంది..like
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు..
Delete