నీవు చనిపోయావన్న వార్త నాలో బాధ కలిగించలేదు...
బతికుండీ నిత్యం చచ్చే కన్నా ఇదే నయం...
నీ చావు నాలో దుఃఖాగ్రహాన్ని రగిలించింది...
నిత్యం జరుగుతున్న ఈ రాక్షస క్రీడ నీ చావుతో అంతం కాలేదు...
వార్త కాని నట్టింట్లో జరుగుతున్న మానభంగాలెన్నో...
ఎదుగుతున్న బాల్యంపై జరుగుతున్న దాడులెన్నో...
అది గృహమో, స్కూలో, కార్ఖానో, కార్యాలయమో ఏదైనా...
ఓట్ల తాబేదార్లు నీ అత్యాచారాన్ని కూడా మొసలి కన్నీరుతో సరుకుగా మాయజేస్తున్నారు...
స్త్రీత్వాన్ని సరుకు చేసిన్నాడే నడి రోడ్డుపై వీళ్ళ నిర్లజ్జతనం బయల్పడింది...
కాట్ వాక్ ల వెంట చొంగ కార్చే వారంతా ఈరోజు కన్నీరొలకబోస్తున్నారు...
ఈ గ్లిజరిన్ కన్నీళ్ళు మాకొద్దు....
కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా...
కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మా...

గ్లిజరిన్ కన్నీళ్ళు మాకొద్దు...
ReplyDeleteఎదిరించే ధైర్యాన్ని, చైతన్యాన్ని ఇస్తాయండి ఇలాంటి రాతలు.
:-( pch
ReplyDeleteఆవేశం బావుంది ఉత్తేజంగా ఉంది
ReplyDelete@ Padmarpita గారు @సృజన గారు @వనజవనమాలి గారు మండుతున్న కన్నీళ్ళ మాటలు రావాల్సిన సమయమిది... ఎక్కడొ ఒక దగ్గర మొదలవ్వాల్సిందే... మనుషులుగా మారాల్సిందే...
ReplyDeletevarmaaji, mee ratallo uttejam chaalu spoortinistundi. meelaa raayagalagaali kavulantaa.
ReplyDeleteఇలాంటి ప్రేరేపించే భావాలు 100 చెపితే 10 అయినా ఆచరణలోకి వస్తే బాగుంటుందండి.
ReplyDelete