పరవశం..
ఒక్క సారిగా యింత కాంతి
కళ్ళు రెండూ చీకట్లు కమ్మినట్టు...
ఓ అల ఏదో ముఖంపై చరిచి
అలసట మాయం చేసినట్టు...
దేహమంతా గులాబీ రేకుల
పరిమళం పూసినట్టు...
ఏదో మత్తు మెదడంతా
ఆవరించి నడకమరిచినట్టు...
ఎక్కడివక్కడ శిలలా
ఆగి పోయి నేనొక్కడినే మిగిలినట్టు...
నీ వేలి చివర మండుతున్న మర్మం
ఏదో లోలోపలకి దూసుకుపోయినట్టు...
నువ్వొచ్చావన్న స్పృహ లోకి
యిప్పుడిప్పుడే వస్తున్నా....
:) chaalaa chakkani bhaavam
ReplyDeleteథాంక్సండీ...
Deleteసృహలోకి వచ్చి కాంతిని కనుమరుగు కానీయకండి.
ReplyDeleteగుబాళింపులేవో నూతనసంవత్సరంలో కూడా ఆస్వాధించండి:-)
అలాగే పరిమళిస్తే ఆస్వాదించకుండా వుండగలనా పద్మార్పిత గారు..:-)
Deleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ..
మరక మంచిదైనట్లు....వెలుగునిచ్చే భావం మిరుమిట్లు:-)
ReplyDeleteఅవునా అలా అని మరక చేసుకోవద్దు తెలుగమ్మాయి గారూ...:-) (just for fun)
Deleteథాంక్సండీ..
గాప్ ఇచ్చేసరికి కవివర్మగారికి భావాలు కొరవడ్డాయేమో అనుకున్నా,
ReplyDeleteమళ్ళీ ఈ నూతన సంవత్సరంలో ఊపందుకుంటారని ఆశిస్తున్నాను.:)
అప్పుడప్పుడూ ఫాం కోల్పోతుంటాం కదా...అలానే అనికేత్..
Deleteథాంక్యూ...