Friday, December 7, 2012

దేహ పర్వతం..


 
దేహమంతా కప్పుకున్న తోలు దుప్పటి తెలుపో నలుపో
లోలోన కాగుతున్న నెత్తురు ఎరుపుదనం ఉడుకుతూ...

కాసింత విశ్రమించే క్షణం లేక కనురెప్పల కత్తిరింపుతో
ఆగిన కాలానికి యింక సెలవిస్తూ...

పరచుకున్న అక్షరాలు అగ్ని శిఖల చివర వెలుగుతూ
కాగితం కమురుదనాన్ని పరచుకుంటూ మాయమౌతున్న ముఖం...

ఓ అబ్ స్ట్రాక్ట్ రేఖా చిత్రంలా కలవని వలయాల మధ్య
నుదుట మీది గీతలు ఏకమవుతూ సుషుప్తిలోకి జారుకుంటూ...

సగం మెలకువలో కదలని దేహ పర్వతం
శ్వాశ కోతకు గురవుతూ తరుగుతూ...

20 comments:

  1. వర్మ గారూ,పరచుకున్న కాగితాలను చూడలేని లోకాన, చురుక్కుమనిపించే కవితల్లో మీ అక్షరాలూ రాటుదేలుతుంటాయి.
    ఎప్పటిలా అభిమానంతో మీకు అభినందనలు చెప్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. మీ అక్షరాత్మీయ స్పందనతో స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు ఫాతిమాజీ..

      Delete
  2. దేహమంతా కప్పుకున్న తోలు దుప్పటి తెలుపో నలుపో
    లోలోన కాగుతున్న నెత్తురు ఎరుపుదనం ఉడుకుతూ...
    ఈ లైన్లు పదే పదే చదువుతూ కళ్ళు మిగతాది చదవడానికి మొరాయిస్తుంటే,
    మనసు మాత్రం మొత్తం చదివి వర్మాజీ గ్రేట్ అని అభినంధిస్తుందండి:-)

    ReplyDelete
    Replies
    1. మీరలా ఆత్మీయంగా మెచ్చుకుంటే ఇంకేం కావాలి పద్మార్పిత గారు... ధన్యవాదాలండీ...

      Delete
  3. అసాంతం అద్భుతంగా ఆవిష్కరించారు.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు Yohanth గారు..

      Delete
  4. అద్భుతమైన పదజాలం ఎప్పటిలాగానే...

    ReplyDelete
    Replies
    1. మీ రెప్పుడూ ఇలా స్ఫూర్తినందిస్తూ వుంటారని...
      ధన్యవాదాలు ప్రేరణ గారూ..

      Delete
  5. బాగున్నాయ్ మీ పదాలు ...

    ReplyDelete
    Replies
    1. మీ అక్షరాభిమానానికి ధన్యవాదాలు వినోద్ గారూ...

      Delete
  6. పదాలే కాదు పటములో కూడా స్పష్టమైన భావాలు మీవి......బాగున్నాయండి.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందన స్ఫూర్తిదాయకం.. ధన్యవాదాలు సృజన గారు...

      Delete
  7. కలవని వలయాల మధ్య గీతలు కలిసి మాత్రం ప్రయోజనం ఏమిటి అనేదే మీ భావమైతే.....నా ఓటు మీకే

    ReplyDelete
    Replies
    1. మీ ఓటు నాకే తర్కం గారూ... ధన్యవాదాలు...

      Delete
  8. అద్భుతమైన భావాలన్నీ ఇలా నిరాశావాదం నుండే ఆవిష్కరిస్తాయా వర్మగారు:-)

    ReplyDelete
    Replies
    1. అంతేకదా తెలుగమ్మాయి గారూ.. నచ్చి నవ్వినందుకు ధన్యవాదాలు....:-)

      Delete
  9. వర్మ గారు బాగుంది మీ కవిత...కాని ఎన్నొ సార్లు చదివితే కాని భావం అర్థం కావడం లేదండి....తేలికైన పదాలతో కవిత రాయడానికి ప్రయత్నించండి.

    ReplyDelete
    Replies
    1. నేను రాసిన వాటిలో బరువైనవేవీ లేవు కదా డేవిడ్ గారూ... భావం అంతర్లీనంగా మార్మికంగా అనిపించవచ్చేమో కానీ నాకు బరువైన పదాల పాండిత్యం లేదు సారూ... మీ ఆత్మీయతకు ధన్యవాదాలు..

      Delete
  10. డేవిడ్ గారిలాగే నాకూను...అర్థమై కానట్లుంటాయి ఒకటికి రెండు సారులు చదివితే అద్భుతంగా అనిపిస్తాయి.

    ReplyDelete
    Replies
    1. ఏంటో మీరు అలా అనేస్తే ఎలా అనికేత్.. రెండు సార్లు చదవాలన్న ఆసక్తి అభిమానం వున్నందుకు ధన్యవాదాలు మీకు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...